రాష్ట్రీయం

ఎక్కడైనా.. ఇక కుదరదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా ఏదో రీతిలో నల్లధనాన్ని అతి సామాన్యుల ద్వారా చెలామణిలోకి తీసుకురావటానికి నల్ల కుబేరులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో హడలెత్తిపోతున్న కేంద్ర ప్రభుత్వం రోజుకో విధమైన ఆంక్షలు తీసుకువస్తుండటంతో బ్యాంకు ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారు. బ్యాంకు తలుపు తెరిచేవరకు ఆ రోజు ఏ విధమైన నిబంధన అమల్లోకి రాగలదో తెలియని విచిత్ర పరిస్థితి. ముందు రోజు రాత్రి వేళల్లో బ్యాంకు మేనేజర్లుకు ఈ ఆంక్షలు తెలుస్తున్నాయి. అయితే కొత్తగా ఖాతాలు తెరిచినవారు డిపాజిట్ చేసిన సొమ్మును వెంటనే విత్‌డ్రా చేయవచ్చా లేదా అన్న విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు లేని వారు ఏ బ్యాంకులోనయినా ఒకసారి రోజుకు నాలుగు వేల రూపాయల వరకు పాత నోట్లను మార్చుకునే వెసులుబాటు కాస్త కొద్ది రోజుల్లోనే పరిహాసంగా మారింది. రోజులో ఒక బ్యాంకు లేదా వివిధ బ్యాంకుల్లో ఒక వ్యక్తి తన ఓపిక ఉన్నంతవరకు లక్ష రూపాయల వరకు మార్చుకోగల్గాడు. ఆధార్ కార్డు, పాన్ కార్డు నెంబరు అయితే కొన్ని బ్యాంకుల్లో సాఫ్ట్‌వేర్ ద్వారా రోజులో రెండోసారి ఆ వ్యక్తిని నిరోధించే అవకాశం ఉంది. అయితే ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డుకు కూడా అవకాశం కల్పించడంతో గుర్తించడానికి వీలులేకపోవడంతో ఎన్నికలు మాదిరిగా ఒక వ్యక్తి కనీసం రెండు వారాల పాటు నగదు మార్చుకోటానికి వీలు లేకుండా వేలికి ఇంకు గుర్తు పెట్టడం ప్రారంభించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కితగ్గిన కేంద్రం బ్యాంకు ఖాతాలు లేనివారెవరూ నోట్లను మార్చుకోడానికి అవకాశం లేకుండా ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏ బ్యాంకు ఖాతాదారుడు సంబంధిత బ్యాంకులోనే మార్చుకోవాలంటూ ఆంక్షలు పెట్టింది. అది కూడా ఒకసారి రెండు వేలు మాత్రమే. పైగా డిసెంబర్ మాసాంతం వరకు రెండోసారి మార్చుకునే అవకాశం లేదు. అయితే ఎంత సొమ్మును అయినా తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు. అయితే వారంలో 24 వేలు వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. రోజుకు రూ.10 వేలు దాటరాదు. ఇక ఎటిఎం కార్డు ద్వారా రోజులో రెండు వేల వరకు డ్రా చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే వివాహాల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా రెండున్నర లక్షల రూపాయలు వరకు డ్రా చేసుకునే అవకాశాన్ని సోమవారం నుంచి కల్పిస్తున్నారు. దీనివల్ల బోగస్ పెళ్లి కార్డులు వెలుగుచూడగలవనే ముందస్తు భయంతో దానికి కూడా పలు రకాల ఆంక్షలు విధించడం జరిగింది. పెళ్లి కార్డుతో పాటు వివాహం జరిగే ఫంక్షన్ హాలు, అడ్వాన్స్ రశీదు, ఇతరత్రా ఆధారాలను చూపాల్సి ఉంది. ఇప్పటికే కార్మికులు తమ పిఎఫ్ సొమ్ము కోసం బోగస్ పెళ్లి కార్డులను, అనారోగ్యంతో కూడిన సర్ట్ఫికెట్లను అందజేస్తూనే ఉన్నారు. రోజుకో విధమైన ఆంక్షలు వస్తుండటం... మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు నడుం కట్టారు. దీంతో కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవడం కోసం ప్రజలు సోమవారం నుంచి బ్యాంకుల్లో బారులు తీరనున్నారు.
2011 జనాభా గణన ప్రకారం దేశంలో ప్రతి ఐదు కుటుంబాలలో మూడు కుటుంబాలకు మాత్రమే ఖాతాలున్నాయి. అంటే 40శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవు.
దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టు 28న ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ప్రారంభించి కేవలం ఐదు మాసాల్లోనే ఈ పథకం కింద రూ.11 కోట్ల 50 లక్షల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇది ఓ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కింది. అలాగే నవంబర్ రెండో తేదీ వరకు దేశం మొత్తంమీద 25 కోట్ల 45 లక్షల మంది ఖాతాలు తెరిచారు. ఎపిలో దాదాపు 79 లక్షల 11 వేల మంది ఖాతాలు తెరిచారు. వీటిల్లో 65 లక్షల ఖాతాలను ఆధార్ నెంబరుకు అనుసంధానం చేశారు. రాష్ట్రంలో మొత్తంమీద కోటి 18 లక్షల 60 వేల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి.
నల్ల కుబేరులు ఈ జీరో బ్యాంకు ఖాతాదారులను కూడా పావులుగా మార్చుకుంటున్నారు. వ్యాపారులు, బడా బాబులు, పారిశ్రామిక వేత్తలు, భూస్వాములు గతంలో తమ వద్ద పనిచేసే కూలీలు, సిబ్బందికి జీరో బ్యాంకు ఖాతాలు తెరిపించి ఆ పుస్తకాలను తమ వద్దనే ఉంచుకున్నారు. ప్రస్తుతం వీటిల్లో నల్ల ధనాన్ని డిపాజిట్ చేసి మరుసటి రోజు డ్రా చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కేంద్రం మేల్కొని రెండు లక్షలు పైగా డిపాజిట్ చేసే ఖాతాలపై కనే్నసింది. అయినా ఏమి కాదంటూ నల్ల కుబేరులు పేదలకు భరోసా ఇస్తున్నారు.

చిత్రం.. గుర్‌గావ్‌లో ఆదివారం ఓ ఎటిఎం నుంచి నగదును తీసుకునేందుకు బారులు తీరిన జనం