రాష్ట్రీయం

టి.సిఎం సలహాదారుగా రాజీవ్ శర్మ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సలహాదారుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నియమితులు కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. రాజీవ్ శర్మ వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే పదవీ విరమణ కావాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు మొదట మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు ఆరు నెలల పాటు ఆయన పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ ఆరు నెలల పదవీకాలం నవంబర్ నెలాఖరుతో ముగిసిపోతుంది. దీంతో ఆయన ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నియామకం అయిన తొలి సిఎస్‌గా రెండున్నర ఏళ్ళుగా రాజీవ్ శర్మ కొనసాగుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వంటి పలు ప్రభుత్వ నిర్ణయాల వెనుక రాజీవ్ శర్మ కీలక భూమిక పోషించారు. చాలా కాలం పాటు కేంద్ర ప్రభుత్వంలో పని చేసిన అనుభవం ఉన్న రాజీవ్ శర్మ సేవలను కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పాలనాపరమైన సంస్కరణల అమలులో వినియోగించుకోవడానికి తన సలహాదారుగా నియమించుకోవాలని సిఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.