రాష్ట్రీయం

త్వరలో పోలవరం కాంక్రీట్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, నవంబర్ 21: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీటు పనులు డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రతి నెలా మూడో సోమవారం పోలవరం పనుల పరిశీలనలో భాగంగా సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.
దేశంలో ఇప్పటివరకు ఇంత భారీ ప్రాజెక్టు రాలేదని, భవిష్యత్తులో కూడ రాదన్నారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చుచేసిందన్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా గత వారం 12.15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితీశారని, వచ్చే నెల నుండి నెలకు 50 నుండి 70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. స్పిల్‌వేలో 21 గేట్ల ద్వారా రోజుకు యాభై లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతుందన్నారు.
స్పిల్‌వే డిజైన్ నవంబర్ 29న అప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత నాణ్యమైన విశాఖ స్టీలు, సిమెంటు వినియోగిస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సామాగ్రి రవాణాకు రూ.518 కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మిస్తామని, ఇందుకుసంబంధించి టెండర్ల ప్రక్రియ వేగవంతంచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 40వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఇప్పటివరకు 46.74 టిఎంసిల నీటిని కృష్ణాకు తరలించామని, ఈ ఎత్తిపోతల లేకపోతే కృష్ణాడెల్టాలో పంటలు పండేవి కావన్నారు.
పట్టసీమ వల్ల శ్రీశైలం నుండి రాయలసీమకు ఎప్పుడూ తీసుకెళ్లని నీటిని తీసుకెళ్లామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలు అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అందరూ సహకరిస్తే త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. పాపికొండలు ప్రాంతాన్ని దేశంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా రూపొందిస్తామని, ఇందుకు సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేసేందుకు డిఎస్పీ ర్యాంకు అధికారిని నియమించామని, అలాగే ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునేందుకు పౌర సంబంధాల అధికారిని నియమిస్తామన్నారు. పురుషోత్తపట్నంవద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిది నెలల్లో పూర్తిచేస్తామన్నారు. ముం దుగా పంటలు వేసుకుంటే మూడోసారి ఆరుతడి పంటలు సాగుచేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఆలాగే పశ్చిమగోదావరి జిల్లాలో ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభిస్తామన్నారు.

చిత్రం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మ్యాప్ ద్వారా
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరిస్తున్న అధికారులు