రాష్ట్రీయం

సోలార్ హబ్‌గా ఎపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 21: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రాన్ని సోలార్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సౌరశక్తికి సంబంధించి వచ్చే ఏప్రిల్ నాటికి దేశంలోనే రాష్ట్రం ఆగ్రస్ధానంలో నిలవడానికి అనువుగా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల మేళవింపు ద్వారా అధికంగా ప్రయోజనాలు సాధించవచ్చునని అంచనా వేస్తున్నామని, ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని, ఇప్పటివరకు పది నిమిషాలపాటు అంతరాయం కలుగుతున్నట్లు గుర్తించామని, దీనిని శూన్యస్ధాయికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాగా ఇంటింటికి నేరుగా గ్యాస్‌ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని, జూన్ 2 నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఫలితాలు ఇచ్చేవిధంగా తీర్చుదిద్దుతామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలోని పోలవరం కుడికాల్వ గట్లపై ఏర్పాటుచేసిన అయిదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంతకాలం పోలవరం కుడికాల్వ మొండికాల్వగా ఉండిపోయిందని, దానిలో జలాలను పారించి గట్లను కూడా సద్వినియోగం చేసే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనిలోభాగంగానే కుడికాల్వ గట్టుపై రూ.37.58కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుచేశామన్నారు. వాస్తవానికి ఈ కాల్వ నిర్మాణంలో దెందులూరు, గన్నవరం ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా అక్కడి ఎమ్మెల్యేలు చొరవ చూపి వాటిని పరిష్కరించటంతో పనులు ముందుకు సాగాయన్నారు. కాగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలను అందిస్తున్నామని చెప్పారు. పశ్చిమ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఇపిడిసిఎల్ మెరుగ్గా పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకు 7,603 సోలార్ పంపుసెట్లను రైతులకు అందించామని, ఈ ఏడాది మరో పదివేల పంపుసెట్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు.

చిత్రం.. సోలార్ విద్యుత్ ప్లాంటును పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు