రాష్ట్రీయం

‘మార్కెటింగ్’పై మరక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 21: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన పత్తి కొను‘గోల్‌మాల్’ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌తోపాటు ఇద్దరు సంయుక్త సంచాలకులు, మరో 89మంది కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులపై చార్జిషీటు దాఖలైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కమిషనర్ మల్లికార్జున నేతృత్వంలో అవినీతి ఉద్యోగులకు తాఖీదులు అందాయి. రెండేళ్ల కిందట వెలుగుచూసిన పత్తి కొనుగోళ్ల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి రామయ్య అజ్ఞాతానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 39 మార్కెట్ యార్డుల ద్వారా 43 కేంద్రాల నుంచి 93 లక్షల క్వింటాళ్ల మేరకు పత్తి కొనుగోళ్లు జరిగాయి. వీటి విలువ సుమారు రూ.650 కోట్లు ఉంటుంది. ఇందులో భారీగా అవకతవకలు వెలుగుచూశాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మార్కెట్ యార్డుల ద్వారా సిసిఐ 50వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా ప్రభుత్వానికి నివేదిక అందించింది. తొలిదశలో 26మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. కాగా గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఇప్పటివరకు ఓ మంత్రికి ఒఎస్డీగా వ్యవహరిస్తున్న రిటైర్డు ప్రభుత్వాధికారి రామయ్య ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా అభియోగాలు వచ్చాయి. అంతేకాదు మార్కెటింగ్ శాఖ అధికారులను తన పలుకుబడిని ఉపయోగించి ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు లేకుండా తప్పించారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆయనను విధుల నుంచి తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రైవేటు ఉద్యోగి కావడంతో సెలవుపై వెళ్లే ఆస్కారం లేదని చెపుతున్నారు. కాగా రాష్టవ్య్రాప్తంగా ఇంతమంది అధికారులు, ఉద్యోగులకు చార్జిమెమోలు జారీ కావడం కలకలం రేపుతోంది. మెమోలు అందుకున్న ఉద్యోగులపై
విచారణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాము నిర్దోషులుగా నిరూపించుకుంటేతప్ప బాధ్యులు ఒడ్డునపడే ఆస్కారం లేదని మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ఇంతమందికి చార్జిమెమోలు దాఖలు చేయటం ఇదే ప్రథమమని ఆయన వివరించారు.