రాష్ట్రీయం

అమరావతికి ఉద్యాన సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహా నగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ (బ్లూ-గ్రీన్) ఉట్టిపడేలా అద్భుతంగా నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయం నిర్మించారు. పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడకదారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు వెలగపూడి నుంచే ప్రారంభించారు. ఐజిసి, తుళ్ళూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ అహ్లాదకరంగా ఉండే విధంగా అనువైన వాతావరణం కల్పించడానికి పచ్చదనం పరుస్తున్నారు. ఇందుకోసం తాత్కాలిక సచివాలయంలోని 5 బ్లాకులతోపాటు పరిసరాల్లో 4.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి. బ్లాకుల వారీగా పచ్చదనం నింపుతున్నారు. ఇప్పటికే రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. పూల మొక్కలకు ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా కడియం, కోల్‌కతా, బెంగుళూరు నుంచి పలు రకాల మొక్కలు తెస్తున్నారు.
ఈ ప్రాంతంలో మొత్తం 92 వేల మొక్కలు నాటి కనువిందు చేయనున్నారు. 32,469 చదరపు మీటర్లలో పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 42 వేల మోండో గడ్డి మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేశారు. ఒక కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ నిర్మించనున్నారు. మరో 1,342 మొక్కలతో నేలంతటినీ పచ్చదనంతో నింపారు. వందల రకాల పూల మొక్కలతోపాటు గడ్డి మొక్కలను కూడా తీసుకు వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన పార్కులలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొక్కల పెంపకానికి కావలసిన మట్టిని తీసుకువచ్చి, చదును చేసి సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బ్లాక్ ఎదురుగా రెండున్నర ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేస్తారు. ఈ పార్క్‌ని రకరకాల పూల మొక్కలతో నింపుతారు. వాటిలో కొన్ని 360 రోజులూ పూస్తునే ఉంటాయి. ఫౌంటేన్లు ఏర్పాటు చేస్తారు. శాసనసభ భవనం ముందు పార్కు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. తుళ్ళూరులో చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపుతున్నారు. ఇక్కడ 80 లక్షల రూపాయల అంచనాలతో పనులు చేపట్టారు. వివిధ రకాల 107 మొక్కలు నాటారు. 8,421 పూలు పూసే గుబురు మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. 646 కొబ్బరి చెట్లు నాటారు. 2,200 చదరపు మీటర్ల స్థలంలో పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా, అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి వివిధ రూపాల్లో కత్తిరించిన 98 మొక్కలను ఏర్పాటు చేశారు. నూతన రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాన చేసిన ప్రదేశాన్ని పూల తోటను మరిపించే విధంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ 2,168 చదరపు మీటర్ల ప్రాంతాన్ని పచ్చికబయళ్ళుతో నింపుతున్నారు. మరో 260 చదరపు మీటర్ల ప్రాంతంలో మొక్కలను ఆకర్షణీయంగా కత్తిరించి హద్దు గోడలు ఏర్పాటు చేస్తారు. అలాగే 50 చదరపు మీటర్ల నేలని పచ్చదనంతో నింపుతారు. వివిధ రకాల 12 మొక్కలను నాటారు. దీంతో నూతన రాజధానికి ఉద్యాన సొబగులు అద్దినట్లయింది.