రాష్ట్రీయం

కదలివస్తున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులకు జరిగిన నష్టం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధ్యయనానికి కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు ఎదురైన సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలను రాష్ట్రాలకు పంపాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఉమ్మడి ఆంధ్రలో ఇక్కడ ఉన్నత పదవులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి రెడ్డి సుబ్రమణ్యం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన నేతృత్వంలో మరో సభ్యుడు, మానవ వనరుల శాఖ డిప్యూటీ సెక్రటరీ అనామికా సింగ్‌తో కూడిన ఇద్దరు సభ్యుల బృందం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ బృందం ఈనెల 25లోగా ప్రధానికి నివేదిక సమర్పించనుందని అధికార వర్గాల సమాచారం. ఇలాఉండగా నోట్ల రద్దు తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజు, వాణిజ్య పన్నులు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. కేంద్రానికి అందజేయనున్న నివేదికపై వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చర్చించారు. నోట్ల రద్దువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క నవంబర్‌లోనే సుమారు రూ.12 వందల కోట్ల నష్టం వాటిల్లిందని, డిసెంబర్‌లో ఈ నష్టం రూ.2000 కోట్ల వరకూ ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కొన్ని శాఖలకు అక్టోబర్‌లో వచ్చిన ఆదాయం నవంబర్ నెలలో ఖజానాలో జమకానుండటంతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై డిసెంబర్‌లో స్పష్టత వస్తుందని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. నోట్ల రద్దు ప్రభావం వల్ల కొత్త రాష్ట్రం తెలంగాణ ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉండటంతో కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను ఆరు నెలలపాటు వాయిదా వేయడంతోపాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కూడా కేంద్రాన్ని రాష్ట్రం కోరనున్నట్టు తెలిసింది.
రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం కేంద్ర బృందం ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డులు, కూరగాయల మార్కెట్లను సందర్శించనుంది. అలాగే వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులను కలిసి నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నది అడిగి తెలుసుకుంటుందని సమాచారం. నోట్ల మార్పిడి, నగదు జమ, విత్‌డ్రాయల్స్ జరుగుతున్న తీరుతెన్నులను కూడా బృందం తెలుసుకోనుందని అధికార వర్గాల సమాచారం.