రాష్ట్రీయం

ఆదివాసీ మృతులకు పరిహారంపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో తొమ్మిదిమంది ఆదివాసీలు ఉన్నారని, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో ఏపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్‌ను ట్రేడ్ కో ఆర్డినేషన్ సెంటర్ ప్రతినిధి నారాయణస్వామి దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 9 మంది ఆదివాసీ కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని పిల్‌లో కోరారు. అమాయకులైన గిరిజనులు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ సంఘటన ప్రదేశం ఏ రాష్టప్రరిధిలోకి వస్తుందని హైకోర్టు ప్రశ్నించగా, విశాఖ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోనికి వస్తుందని పిల్ దాఖలు చేసిన సంస్ధ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు నోటీసులు జారీ చేసి కేసును వాయిదా వేసింది.
కోడిపందేలపై విచారణ
వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను వివరించాలంటూ హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
కోడిపందేలను నిరోధించాలంటూ ఆయన 2014లో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. వచ్చే వారంరోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోడిపందేలపై తన వైఖరిని తెలియచేయాలంటూ ఏపి ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.