రాష్ట్రీయం

జిఎస్‌టి బిల్లుకు ఆమోదం తర్వాతే అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభిస్తేనే, అసెంబ్లీని సమావేశపరిచి ఆమోదం తెలపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పార్లమెంటులో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందకపోతే, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం మంచిదన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏకీకృత పన్ను విధానానికి సంబంధించి రాజ్యాంగ సవరణ కోసం రెండు నెలల క్రితం పార్లమెంటు ఉభయ సభలూ ఆమోద ముద్ర వేసి అన్ని రాష్ట్రాల ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజు అసెంబ్లీని సమావేశపరిచి దానికి ఆమోదం తెలిపింది. ఏపి కూడా వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సగానికి పైగా అంటే 16 రాష్ట్రాలకు మించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లును ఆమోదించి అన్ని రాష్ట్రాలకు పంపిస్తుంది. అన్ని రాష్ట్రాలూ ఆ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆమోదం కోసం జిఎస్‌టి బిల్లు రాకపోతే ఏకంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవాలని ఏపి ప్రభుత్వం కూడా భావిస్తోంది. వర్షాకాల సమావేశాలు నిర్వహించినందున, ఏపి అసెంబ్లీకి రాజ్యాంగపరమైన చిక్కు ఏమీ లేదు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ సమావేశాలను ఆరు నెలల వ్యవధికి మించి నిర్వహించకపోతే ఆ అసెంబ్లీ ఆటోమెటిక్‌గా రద్దు అవుతుంది. కాబట్టి ఏపి ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. శీతాకాల సమావేశాల నిర్వహణకు విజయవాడ (అమరావతి)లో ఆశించిన విధంగా ఏర్పాట్లు కాలేదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం వస్తే హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనంలోనే ఒక్కరోజు అసెంబ్లీని నిర్వహించుకోవచ్చనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం కూడా రాజ్యాంగ సవరణ కోసం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించినందున నేరుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఆలోచన చేస్తున్నది. జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం వస్తే మాత్రం శీతాకాల సమావేశాలు నిర్వహించవచ్చని భావిస్తున్నది. పార్లమెంటులో పెద్ద నోట్ల రద్దుపై ప్రతిరోజూ గొడవ జరుగుతున్నందున, జిఎస్‌టి బిల్లును ప్రతిపాదించి ఆమోదించే సూచనలు కనిపించడం లేదని రాజకీయ విశే్లషకులు అంటున్నారు.