రాష్ట్రీయం

మావోల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, నవంబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఇరువురు మావోయిస్టు సానుభూతపరులను అరెస్టు చేసినట్లు వెంకటాపురం సిఐ సాయిరమణ తెలిపారు. వారివద్ద నుంచి మావోయిస్టులకు సంబంధించిన రూ.70వేల నగదుతో పాటు ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో చర్ల పోలీసులు తాలిపేరు వద్ద తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు సంతకు వెళ్తున్న ఇరువురు వ్యాపారులు గాదంశెట్టి రాజేష్, అజిత్ అనే వ్యక్తులను తనిఖీ చేయగా వారివద్ద కొంత నగదుతో పాటు మావోయిస్టులకు సంబంధించిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. దీంతో వారిని స్థానిక పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా మావో సానుభూతిపరులుగా పని చేస్తున్నట్లు తెలిపారన్నారు. వారివద్ద నుంచి రూ.70వేల నగదు, ఏకే 47 తుపాకీకి చెందిన ఫిల్లింగ్‌లు 10, తుపాకీలు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పుల్‌ఫుల్ తాడులు 20, విజిల్‌కార్డులు 20, బెల్టులు 10, జంగిల్‌షూలు 5 జతలు, చేతి గడియారాలు, స్క్రీన్‌గార్డులు, నల్లని పట్టాలు 10 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు.

చిత్రం.. పట్టుబడిన మావోయిస్టు సానుభూతిపరులు, నగదును చూపిస్తున్న పోలీసులు