రాష్ట్రీయం

బాల్యంనుంచి చివరి దాకా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), నవంబర్ 22: స్వర మాంత్రికుడు పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం మూగవోయింది. ఏకసంతాగ్రాహి అయిన ఆయనను వరించని బిరుదు, అవార్డులు, పురస్కారాలు లేవనే చెప్పుకోవాలి. దాదాపు ఏడు, ఎమినిది సంవత్సరాల వయసులోనే విజయవాడ నగరానికి వచ్చి గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతుల వారి వద్ద శిష్యునిగా చేరారు. అప్పటికే ఆయన సంగీత కచేరీలు చేస్తూ బాలగంధర్వునిగా అందరి ప్రశంసలను పొందుతున్నారు. అలా ఉజ్వలంగా ఎదుగుతున్న ఆయన విజయవాడ అకాశవాణి కేంద్రంలో మ్యూజిక్ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తుండగా 1960లో విజయవాడలోని ప్రస్తుత ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రధానోపాధ్యాయుడిగా నియమితులై దాదాపు మూడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. అనంతరం మద్రాసుకు మకాం మార్చుకున్నారు. సత్యనారాయణపురంలోని ఎకెటిపి స్కూల్ సమీపాన వారి ఇల్లు నేటికీ ఉంది. ఆ వీధికి నగరపాలక సంస్థ వారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వీధి అని పేరు కూడా పెట్టారు. నగరపాలక సంస్థ ప్రథమ మేయర్ టి వెంకటేశ్వరరావు బాలమురళీకృష్ణకు అదే వీధిలో పౌర సన్మానం చేశారు.
బాలమురళి మృతి వార్త వినటంతోనే సంగీత ప్రపంచాన్ని చీకటి అలుముకుంది అని చెప్పుకోవచ్చు. అలవోకగా అప్రతిహతంగా సాగే ఆయన గానం శ్రోతల, సంగీత ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ పల్లవిస్తూనే ఉంటుంది. ఈ మధ్య నగరంలో జరిగిన కృష్ణా పుష్కరాలకు ఆయన విచ్చేసి కృతులు పాడారు.
నేడు ఘంటసాల సంగీత,
నృత్య కళాశాలకు సెలవు
రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ డి విజయభాస్కర్ శాఖ సిబ్బంది, జివిఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ కెఎస్ గోవిందరాజన్, ఎన్‌సిహెచ్‌బి ఆచార్యులు, ముడమళ్ల విజయకుమార్ తదితర సిబ్బంది మంగళంపల్లి బాలమురళికి ఘన నివాళులర్పించి బుధవారం కళాశాలకు సెలవు ప్రకటించారు.

చిత్రాలు..విజయవాడలోని బాలమురళీకృష్ణ ఇల్లు.
విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ వీధికి మంగళంపల్లి పేరు పెట్టిన దృశ్యం