రాష్ట్రీయం

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై ముగిసిన వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: ఓటుకు నోటు కేసులో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఏసిపి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఏసిబి కోర్టులో ఈ కేసును విచారించాలంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తాజా దర్యాప్తుకు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ ఏపి సిఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి కోర్టు ఏసిబి కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అనంతరం ఈ ఆదేశాలపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను విచారించి నాలుగు వారాల్లోగా ఈ కేసును విచారించి తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై జస్టిస్ సునీల్ చౌదరి కోర్టు ఈ కేసును విచారించింది. ఈ కేసులో వైకాపా ఎమ్మెల్యే తరఫున పి సుధాకరరెడ్డి, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుతరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదించారు. ఏసిబి తరఫున వి రవికిరణ్‌రావు వాదించారు. ఈ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తన వాదనలు వినిపించారు.