రాష్ట్రీయం

బాలమురళితో రామదాసుకు జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 22: భక్తరామదాసు ఆ రాముడిపై కీర్తనలు రచిస్తే వాటికి తన శ్రావ్యమైన గొంతుతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రాణం పోశారు. 2011లో వాగ్గేయకారోత్సవాల సందర్భంగా ఆయన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. రామదాసు కీర్తనలకు వ్యాప్తి, కీర్తి తీసుకువచ్చిన వారు బాలమురళే. రామదాసు కీర్తనలను అనేకం స్వరపరచి మృదుమధురంగా ఆలపించి లోకానికి అందించిన స్వరబ్రహ్మ మంగళంపల్లి. ఆయన ఆలపించిన అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, పలుకే బంగారమాయెనా, తారక మంత్రము కోరిన దొరికెను, సీతమ్మకు చేయిస్తి లాంటి ఎన్నో రామదాసు కీర్తనలు భద్రాచల గోదావరీ తీరంలో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. ఆలయంలో ప్రతి నిత్యం బాలమురళి గాత్రం రామచంద్రుడికి స్వరార్చన చేస్తూనే ఉంటుంది. ఆయన మరణంతో భద్రాద్రి మూగబోయింది. బాలమురళి మృతి పట్ల భద్రాచల ఆలయ ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు సంతాపం ప్రకటించారు. భౌతికంగా బాలమురళి మన మధ్య లేకపోయినా, ఆయన స్వరం భద్రాచలంలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని ఆన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 2015లో జరిగిన పౌర సన్మానం సందర్భంగా గుర్రపు బగ్గీపై ఊరేగుతున్న బాలమురళీకృష్ణ (ఫైల్ ఫొటో)