రాష్ట్రీయం

ప్రముఖుల సంతాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ మరణం తెలుగు రాష్ట్రాలకే కాదు..మొత్తం దేశానికి..సంగీత ప్రపంచానికే తీరనిలోటు అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్‌ఎన్ నరసింహన్ అన్నారు.
భారతీయ శాస్ర్తియ సంగీతం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి బాలమురళీకృష్ణ అని, ఆయన మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.ప్రపంచానికే గొప్ప సంగీత విద్వాంసుడు బాలమురళీ కృష్ణ అని ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ఏపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
* మంగళంపల్లి తెలుగు జాతికే ఆణిముత్యం.
-డాక్టర్ చక్రపాణి, చైర్మన్, ఏపి విధానపరిషత్
* మురళీకృష్ణ మరణం నన్ను కలిచివేసింది.
-కె. స్వామిగౌడ్, చైర్మన్ టి.విధాన పరిషత్
* మురళీకృష్ణ మరణం పట్ల ప్రగాఢసానుభూతి తెలియచేస్తున్నాను.
-కోడెల శివప్రసాదరావు, స్పీకర్, ఏపి అసెంబ్లీ
* గానగంధర్వుడు మంగళంపల్లి. మరణం యావత్ భారతజాతికే తీరనిలోటు.
-మధుసూదనాచారి, స్పీకర్, టి. అసెంబ్లీ
* మంత్రముగ్ధులను చేసే గాత్రం, కంపోజింగ్ లో ప్రత్యేక శైలి మంగళంపల్లిదే.
- కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ
* సంగీతంలోని అన్ని విభాగాల్లో విస్తారమైన పాండిత్యం ఉన్న మహామనీషి బాలమురళీకృష్ణ.
- నారా లోకేష్ , టిడిపి జాతీయ కార్యదర్శి
* సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరం మంగళంపల్లి.
- తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్
* గానగంధర్వుడు మంగళంపల్లి మరణం యావత్ దేశానికే తీరనిలోటు.
-వైఎస్ జగన్,అధ్యక్షుడు, వైకాపా
* సంగీతం ద్వారా సమైక్యతను పెంచారు
- బిజెపి మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి
* కొత్త కొత్త సంగీత రాగాలను ఆవిష్కరించిన మహా విద్వాంసుడు.
- బిజెపి కార్యదర్శి పి పాపారావు
* బాల మురళీ విగ్రహం విజయవాడ గాంధీ సెంటర్‌లో నెలకొల్పాలి
- వాసిరెడ్డి అమర్నాద్, విద్యావేత్త
* మంగళంపల్లి లేని లోటు సంగీత సామ్రాజ్యానికి పూడ్చలేనిది.
-టి.టిడిపి నేతలు ఎల్ రమణ, ఎ రేవంత్‌రెడ్డి
* అన్ని రంగాలను ప్రభావితం చేసిన మహానుభావుడు మంగళంపల్లి.
- నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ