ఆంధ్రప్రదేశ్‌

26న తాడేపల్లిగూడెంలో అమిత్ షా సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: దేశంలో పెద్ద నోట్ల రద్దు, తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం చేస్తున్న సాయంపై ప్రజలకు వివరించేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా 26వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారని ఆ పార్టీ ఏపి నేత ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఇక్కడి బిజెపి కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 26న తాడేపల్లిగూడెంలో అమిత్‌షా కార్యక్రమం ఖరారైందని, లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పలువురు పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని ఆయన వివరించారు. కేంద్రప్రభుత్వం రైతులకు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలపై అమిత్ షా నివేదిక అందిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అన్ని రంగాల్లో ఆర్థిక సాయం అందించిందని వాటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా ఉందని, అమిత్ షా ఆ వివరాలను ప్రజలకు అందిస్తారని అన్నారు. సి వోటర్ సర్వేలో నరేంద్రమోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రజలు పేర్కొన్నారని ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం ద్వారా పెద్ద నోట్ల రద్దుకు తమ బాసట ప్రకటించారని అన్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, కేంద్రం సులభతరమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, అయితే బ్యాంకు మేనేజర్లు కొంత మంది ఇబ్బంది పెడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్న మాట నిజమేనని అన్నారు. ఈ విషయంలో ఎప్పటికపుడు కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. నల్లకుబేరులను కూకటివేళ్లతో పెకిళించే వరకూ ప్రధాని నిద్రపోరని, ఎక్కడైనా సామాన్యులకు ఇబ్బందులు ఎదురైతే కేంద్రప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.