రాష్ట్రీయం

పాత పద్ధతిలోనే లా కాలేజీల్లో ఫీజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ న్యాయవిద్యా కళాశాలల్లో పాత పద్ధతిలోనే 2016-17 సంవత్సరానికి సైతం ఫీజులు కొనసాగుతాయని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రకటించింది. రాష్ట్ర హైకోర్టు 33922/2016 రిట్‌పిటీషన్‌లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రెగ్యులేటరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు.
లా కాలేజీల్లో ఫీజులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయకపోవడంతో తెలంగాణలోని లా కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజులను దండుకుంటున్నాయి. ఇదేమిటని విద్యార్ధులు ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చినదగ్గర చెప్పుకోండంటూ దబాయిస్తున్నాయి. అసలు పాత పద్ధతిలో ఉన్న ఫీజులు ఏమిటో ప్రభుత్వ కాలేజీల్లో ఫీజుల వివరాలు కాని, ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల వివరాలు కాని బహిర్గతం చేయకుండా పరోక్షంగా ప్రైవేటు యాజమాన్యాలకు చేదోడు వాదోడుగా ఉండటంతో 10వేలు అధికారిక ఫీజు వసూలు చేయాల్సిన కాలేజీల్లో 20వేల వరకూ వసూలు చేస్తున్నాయి.

తెలంగాణ
నేతలకు ఊరట
మంత్రులపై కేసును
కొట్టివేసిన రైల్వే కోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 23: సికిందరాబాద్ రైల్వే కోర్టులో తెలంగాణ నేతలకు ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో పాల్గొన్న పలువురు నాయకులపై పెట్టిన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసింది. తమపై నమోదైన కేసుల విచారణ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కెటిఆర్, పద్మారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితోపాటు టిజెఎసి చైర్మన్ కోదండరాం తదితరులు కోర్టుకు హాజరయ్యారు. 2011లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా పల్లెపల్లె పట్టణాలపైకి అనే నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో వీరితోపాటు పాల్గొన్న పలువురిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.