కృష్ణ

కృష్ణాలో నగదురహిత లావాదేవీలకు పెద్దఎత్తున ఈ-పోస్ మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: జిల్లాలో నగదురహిత లావాదేవీలు అమలు జరిపే విధంగా పెద్ద ఎత్తున ఈ-పోస్ మిషన్లు ప్రవేశపెట్టటానికి కార్యక్రమం రూపొందించటం జరిగిందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్‌లో సబ్-కలెక్టర్ సలోని సిదాన, డిఎస్‌ఓ వి రవికిరణ్, ఎల్‌డియం వెంకటేశ్వరరెడ్డితో ఇ-పాస్ మిషన్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వర్తకుల వివరాలను సేకరించి వారికి ఈ-పోస్ మిషన్‌లు పంపిణీ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో గ్రామాలవారీగా ఎంతమంది వర్తకులు ఉన్నారు. వారి రిజిస్ట్రేషన్ అయిన వివరాలు, ఎన్ని ఈ-పోస్ మిషన్లు ఉన్నాయనే సమాచారాన్ని సేకరిస్తున్నమన్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారం చేసే వర్తకులకు రిజిస్ట్రేషన్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే గ్రామపంచాయతీ సెక్రటరీలు, మున్సిపాల్టీలలో మున్సిపల్ కమిషనర్లు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వర్తకునికి స్థానికంగా ఉన్న బ్యాంకుల్లో కరెంటుఖాతా తప్పనిసరిగా ఉండలన్నారు. ఇ-పోస్ మిషన్లను బ్యాంకు వారు సరఫరా చేస్తారని జెసి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఇ-పోస్ మైక్రో ఎటిఎంల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇ-పోస్ మిన్లను ఏర్పాటు చేసి జిల్లాలో నగదు రహిత లావాదేవీల ప్రక్రియ వేగవంతంగా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇ-పోస్ మిషన్ల సరఫరాకు సంబంధిత ఏజెన్సీలను సంప్రదిస్తున్నట్లు గంధం చంద్రుడు తెలిపారు.
యుపిఎస్‌సి మెయిన్ ఎగ్జామినేషన్‌కు లయోలా కళాశాల
3నుండి 9వరకు జరిగే యుపిఎస్‌సి మెయిన్ ఎగ్జామినేషన్‌కుగాను పరీక్షా కేంద్రాలను విజయవాడ లయోలా కళాశాల ఎంపిక అయినట్లు జెసి తెలిపారు. ఈ సందర్భంగా లయోలా కళాశాలలో పరీక్ష నిర్వహణా కేంద్రాలను, స్ట్రాంగ్ రూములు జెసి, విజయవాడ సబ్-కలెక్టర్ సలోని సిదానితో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో జెసితో పాటు విజయవాడ అర్బన్ తహశీల్దార్ శివరావు, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఒ.మహేష్‌లు పాల్గొన్నారు.

ఎటిఎంల వద్ద
ఖాతాదారుల బారులు
అవనిగడ్డ, నవంబర్ 23: అవనిగడ్డ పరిధిలోని పలు బ్యాంకుల వద్ద ఇంకా చిల్లర సమస్య వెంటాడుతూనే ఉంది. అవనిగడ్డలో దాదాపు 10 ఎటిఎంలు ఉన్నప్పటికీ చిల్లర లేకపోవటంతో ఖాతాదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్‌లకు చెందిన అన్ని ఎటిఎంలు మూతపడగా ఒకే ఒక ఆంధ్రాబ్యాంక్ ఎటిఎం మాత్రమే పనిచేస్తుండటంతో రద్దీ పెరిగింది. అక్కడ కూడా ఎక్కువ సేపు నగదు నిల్వ లేకపోవటంతో నిరాశతో ఖాతాదారులు తిరిగి వెళుతున్నారు. ఆంధ్రా బ్యాంక్ ఎటిఎంల వద్ద బారులుతీరి కనిపిస్తున్నారు.

యార్లగడ్డ హఠాన్మరణంపై బుద్ధప్రసాద్ దిగ్భ్రాంతి
అవనిగడ్డ, నవంబర్ 23: డా. యార్లగడ్డ బాలగంగాధరరావు హఠాన్మరణం తనకు ద్రిగ్భాంతి కలిగించిందని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన గంగాధరరావుకు సంతాపం తెలుపుతూ పెదప్రోలు గ్రామంలో జన్మించిన ఆయన నామశాస్త్రంలో అద్వితీయుడిగా పేరొందారన్నారు. గ్రామ నామాల మీద, ఇంటి పేర్లపై పరిశోధనలు చేయడమే కాకుండా అనేక మందిని ప్రోత్సహించి పరిశోధనలు చేశారన్నారు. ఆయన అనేక గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారని, మహాభారతం, మహాభాగవతం, హరివిలాసం, రాధికా సాంత్వనం, ఆంధ్ర నాయక శతకం, హంసలదీవి వేణుగోపాలస్వామి శతకాలకు వ్యాఖ్యానాలు రచించి ప్రచురించారన్నారు. శ్రీనాథుడు జన్మస్థలంపై ఆయన పరిశోధనలు చేశారన్నారు. దీవిసీమ అంటే బాలగంగాధరరావుకు వల్లమాలిన అభి