రాష్ట్రీయం

ఏకతాటిపైకి పీఠాధిపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ ధర్మంపై దాడులకు అడ్డుకట్ట
పల్లెల్లోకి ధార్మిక సాహిత్యం
హిందూ స్ఫూర్తి కార్యక్రమాల నిర్వహణ
ఎజెండా వెల్లడించిన చినజీయర్, పరిపూర్ణానంద, సుబుధేంద్ర

హైదరాబాద్, నవంబర్ 24: దక్షిణ భారతదేశంలో తొలిసారి మహాద్వైత, అద్వైత, ద్వైత మార్గాలను అనుసరించే ధర్మ ప్రచారకులంతా ఒకే వేదికపైకి వచ్చి ‘హిందూ ధర్మాచార్య ప్రతిష్ఠాన్’ పేరిట హిందూ ధర్మ పరిరక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. ధార్మిక సాహిత్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లడం, మత స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా చూడటం, హిందూ స్ఫూర్తి కార్యక్రమాలను నిర్వహించడం, మత గ్రంధాలను ముద్రించి, పరిరక్షించడం, హిందూ మత సంస్థలు, ప్రచారకుల మధ్య సౌహార్ర్దాన్ని నెలకొల్పడం వంటి లక్ష్యాలతో సంస్థను ఏర్పాటు చేసినట్టు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి చెప్పారు. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి, మంత్రాలయ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ స్వామిలతో కలిసి ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడారు. దేశంలో ఇతర మతాలు తమ మతాన్ని ప్రచారం చేసుకోవడంలో కొత్త పోకడలను అవలంబిస్తున్నాయని, ఇతర మత గ్రంథాల్లో ఉన్నవి కూడా తమ గ్రంథాల్లోనివేనని చెబుతున్నారని, భారతీయులు విశ్వసించే దేవతలను సైతాన్‌లుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మతానికి చెందిన వారినే పూజించాలనే ప్రచారం బాగా సాగుతోందని, ఒక మతానికి చెందిన గ్రంథాలను, ఇతర మత గ్రంథాలతో సమన్వయం చేయడం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని అన్నారు. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ సాగుతున్న కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హిందూ ధర్మాచార్య ప్రతిష్ఠాన్ ఏర్పాటు చేయడమైందని అన్నారు.
ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మంపై మూడు రకాల దాడులు జరుగుతున్నాయని, హిందూ ధర్మాన్ని కొందరు అదేపనిగా దుమ్మెత్తి పోస్తున్నారని, హిందూ గ్రంథాలపై దుష్ప్రచారం చేస్తున్నారని , హిందూ పురాణాలను, వేదాలను వక్రీకరిస్తున్నారని చెప్పారు. మతం పేరుతో దేశంపై దాడి జరుగుతోందని, దోపిడీ జరుగుతోందని హిందూ ధర్మంపై జరుగుతున్న దుర్మార్గాలన్నీ ప్రజలలోకి తీసుకువెళ్లడానికే హిందూ ధర్మాచార్య ప్రతిష్ఠాన్ ఏర్పాటు చేశామని అన్నారు.
సుబుధేంద్ర తీర్ధస్వామి మాట్లాడుతూ హిందూ ధర్మం చాలా గొప్పదని, ఇతర మతాలను దెబ్బతీయడం హిందూ మతం ఉద్దేశం కాదని, హిందూ మత ధర్మాన్ని కాపాడుకోవడానికే హిందూ ధర్మాచార్య ప్రతిష్ఠాన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
చిత్రం...
విలేఖరులతో మాట్లాడుతున్న చిన జీయరు స్వామి, పరిపూర్ణానంద స్వామి, సుబుధేంద్ర తీర్థస్వామి