రాష్ట్రీయం

నేడే మోదీ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీస్ సంస్థల అధిపతుల 51వ వార్షిక సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో మూడు రోజులపాటు జరుగునున్న సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్టప్రతి పోలీస్ పథకాలను, పోలీస్ పథకాలను ప్రదానం చేస్తారు. ఈ జాతీయ సదస్సును 2013 వరకు ప్రతి యేటా ఢిల్లీలో నిర్వహిస్తూ వచ్చారు. 2014 నవంబర్‌లో అస్సాంలోని గౌహతిలో జరుగగా, గత ఏడాది గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌లో జరిగింది. ఈ యేడాది హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో గల సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఉగ్రవాదం, తీవ్రవాదం, నకిలీ కరెన్సీ చలామణి, వ్యవస్ధీకృత నేరాల నియంత్రణ, అంతరాష్ట్ర నేరగాళ్ల పట్టివేత, సైబర్ నేరాలు, ఇంటర్‌పోల్ ద్వారా విదేశాల్లో నక్కిన నేరగాళ్లను తీసుకురావడం, ఆర్ధిక నేరాల నియంత్రణ తదితర 17 అంశాలపై చర్చిస్తారు. ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేషనల్ పోలీసు అకాడమికి చేరుకుని అక్కడే బస చేస్తారు. శనివారం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు డిజిపిలతో చర్చిస్తారు. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోలీస్ అధిపతుల జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీస్ అకాడమి పరిసరాల్లో 144వ సెక్షన్ విధించారు. మూడు రోజులపాటు జరుగునున్న జాతీయ సదస్సుకు భద్రత కట్టుదిట్టం చేశారు.