ఆంధ్రప్రదేశ్‌

ఆస్తులు, ఉద్యోగులను చర్చించి పంచుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను విడదీయడంతో ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాన్ని ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సమస్యను డిసెంబర్ 7వ తేదీలోగా పరిష్కరించుకోవాలని కూడా హైకోర్టు గడువు విధించింది.
ట్రిబ్యునల్‌ను ఇరు రాష్ట్రాలకు విడదీసినప్పటికీ ఉద్యోగుల జీతభత్యాల వ్యయ భారం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే పడుతోందని న్యాయవాది డి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.