రాష్ట్రీయం

అద్దెకు జన్‌ధన్ ఖాతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులు తమ వద్ద ఉన్న రద్దయిన కరెన్సీని జన్‌ధన్ ఖాతాల్లో భారీ ఎత్తున డిపాజిట్ చేస్తున్నట్లు ఆదాయం పన్ను శాఖకు సమాచారం లభించింది. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గుజరాత్, యుపి, కేరళ, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో జన్‌ధన్ ఖాతాల్లో భారీ ఎత్తున రద్దయిన కరెన్సీ డిపాజిటయింది. ఆంధ్రాలో కోస్తా జిల్లాల్లో, కర్నాటక తదితర రాష్ట్రాల్లో నల్లకుబేరులు ఒక్కో జన్‌ధన్ అకౌంట్‌దారుడికి నెలకు రూ.10వేల వరకు సొమ్ము చెల్లించి, అకౌంట్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు అభియోగాలు వస్తున్నాయని ఆదాయం పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఇంతవరకు శాంపిల్‌గా చేపట్టిన సర్వేలో దేశం మొత్తం మీద దాదాపు 4వేల జన్‌ధన్ అకౌంట్లలో ఆశ్చర్యపరిచే విధంగా డిపాజిట్లు ఉన్నాయి. ఇవన్నీ నవంబర్ 8 తర్వాతే డిపాజిటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 400 వరకు డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. ఇది శాంపిల్ మాత్రమే. రానున్న రోజుల్లో జరిగే స్కానింగ్ వల్ల పెద్ద సంఖ్యలో జన్‌ధన్ ఖాతాలను నల్లకుబేరులు దుర్వినియోగం చేస్తున్న సంగతిని ఆధారాలతో బయటపెట్టనున్నట్లు ఐటి వర్గాలు తెలిపాయి. జన్‌ధన్ ఖాతా అకౌంట్‌దారుడి ఎటిఎం కార్డు, బ్యాంకు పుస్తకం, చెక్ పుస్తకం అన్నింటినీ తమ ఆధీనంలో ఉంచుకుని ఈ వ్యవహారం తేలేవరకు నెలకు పదివేల రూపాయల చొప్పున సొమ్ము చెల్లించే ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆదాయం పన్ను శాఖకు సమాచారం అందుతోంది.