రాష్ట్రీయం

సమన్వయంతో పని చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: నాయకులు, కార్యకర్తల మధ్య సఖ్యత, సహకారం, సమన్వయం ఉన్నప్పుడే పార్టీ పటిష్టంగా ఉంటుందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆదివారం టిటిడిపి సర్వసభ్య సమావేశం టిడిపి కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో ఏమి చేశామన్నది ముఖ్యం కాదని, ప్రస్తుతం ఏమి చేయాలన్నది ప్రధానమని ఆయన తెలిపారు. సమస్యల పట్ల బాగా పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని చెప్పారు. 31 జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు. నాలుగు నియోజకవర్గాలకు ఒక జిల్లా ఉంది కాబట్టి సమన్వయం చేసుకోవడం జిల్లా నాయకులకు పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. బలం, బలహీనత నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గట్టిగా పోరాటం చేయాలంటే పటిష్టమైన యంత్రాంగం ఉండాలని అన్నారు.

నిమ్స్‌లో జనసేన నోట్ల పంపిణీ

హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 27: బ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలో చిన్ననోట్లు లేక ఇబ్బంది పడుతున్న రోగులు, వారి సహాయకులకు జనసేన పార్టీ నేతలు నోట్లను అందించారు. ఆదివారం పార్టీ నేత కళ్యాణ్ దిలీప్ ఆధ్వర్యంలో ఓ బృందం నిమ్స్‌కు చేరుకొని విశ్రాంతి శాలలో సేద తీరుతున్న రోగుల వద్ద ఉన్న పాత నోట్లకు బదులుగా చిన్ననోట్లను ఇచ్చారు. అదేవిధంగా మందులు లేక ఇబ్బంది పడుతున్న రోగులకు మందులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాదారణ రోజుల్లోనే ఇబ్బందులు పడే వారికి నోట్ల రద్దు అనంతరం కష్టాలు రెట్టింపు అయ్యాయని, అందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యలపై నిలదీద్దాం, ప్రశ్నిద్దాం.. సాయం చేద్దామని తమ అధినేత ఇచ్చిన ప్రేరణతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న నిమ్స్ వర్గాలు తమ అనుమతి లేకుండా ఏలా చేస్తారని నిలదీశారు. అప్పటికే వారితో తెచ్చుకున్న చిన్ననోట్లు అయిపోవడంతో వారు నిమ్స్‌ను నుంచి వెళ్లిపోయారు.

రోగులకు కొత్త నోట్లను అందిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలు

అరకును వణికిస్తున్న చలి!

అరకులోయలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
పర్యాటకులు, స్థానికులు ఇక్కట్లు
పొగమంచుతో ఘాట్‌రోడ్డు ప్రయాణం నరకం

అరకులోయ, నవంబర్ 27: విశాఖపట్నం జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన అరకులోయలో చలి పులిలా విజృంభిస్తోంది. దీనితోడు దట్టంగా మంచు కురుస్తుండడంతో స్థానికులు, పర్యాటకులు గజగజ వణికిపోతున్నారు. రోజు రోజుకూ ఊష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరుగుపోతోంది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గి రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అరకులోయలో శనివారం రాత్రి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. పొగమంచుతో కూడిన చలి గాలులు వీస్తుండడం వలన ఈ ప్రాంతీయులు ఇళ్ల నుంచి బైటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
గెడ్డల పరిసరాల్లోని గ్రామాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఎముకలు కొరికే చలిలో గిరిజనులు వరి కోతలు, నూర్పులు వంటి పనులు చేపడుతుండగా, పర్యాటకులు మాత్రం చలి గాలులు, పొగ మంచుల మధ్య ఈ ప్రాంత అందాలను తిలకిస్తున్నారు. చలి ప్రభావంతో వణికిపోతున్నా, ఈ ప్రాంతంలోని ఆహ్లాదకర వాతావరణాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. తమ తమ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణం అసలు ఉండదని, అద్భుతమైన వాతావరణం ఈ ప్రాంతంలో ఉందని పర్యాటకులు కితాబునిస్తున్నారు.
ఘాట్‌రోడ్డులో రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురికావలసి వస్తోంది. రోడ్డుపై దట్టమైన పొగ మంచు కమ్ముకుని ఉంటుండడంతో రహదారి కనిపించక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో శివలింగపురం నుంచి అరకులోయకు గంటన్నర సమయానికి రావాల్సిన వాహనాలు దాదాపు రెండున్నర గంటల సమయం పడుతోంది. ఎదురుగా వస్తున్న వాహనాలు, పశువులు, బాటసారులు కనిపించక వాహనాల స్పీడ్‌కు అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి. చలి, మంచు కారణంగా ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

అరకులోయలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు