జాతీయ వార్తలు

పేదను బలిచేయొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: పేదల బ్యాంకు ఖాతాలను ఆసరా చేసుకుని తమ అక్రమ సొత్తును డిపాజిట్ చేసే వారిని వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా తెరుచుకున్న జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం రెండు వారాల వ్యవధిలోనే వేలాది కోట్ల రూపాయలు జమ అయ్యాయంటూ వచ్చిన కధనాల నేపథ్యంలో మాట్లాడిన మోదీ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తామని తెలిపారు. నగదు రహిత లావాదేవీల వ్యవస్థ దిశగా అడుగులు వేయాలని, ఈ రకమైన ఆర్థిక జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆదివారం చేసిన మన్‌కి బాత్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి పెద్దలకు, పేదలకు తెలియజేయాలని, వారిలో సరైన అవగాహన కలిగించాలని యువతను కోరారు. దేశ వ్యాప్తంగా 500, 1000 నోట్ల రద్దు అనంతరం ఆకాశవాణిలో తొలిసారిగా మాట్లాడిన మోదీ తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని ఈ అంశానికే కేటాయించారు. తన నిర్ణయం వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారంటూ విపక్షాలు ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని ఆయన క్షుణ్ణంగా ప్రస్తావించారు. ఇప్పటికీ కూడా తమ అక్రమార్జనను అదే అక్రమ మార్గాల్లో మార్చుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న మోదీ ఇందుకోసం వారు పేదలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రలోభాలు కల్పించి వారిని లోబరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తప్పుడు చర్యలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన బినామీ లావాదేవీల నిరోధక చట్టం అమలులో ఉందని, దీని ద్వారా ఇలాంటి తప్పుడు డిపాజిట్లు అంత సులువుగా సాగే అవకాశమే ఉండదని చెప్పారు. అక్రమాలకు పాల్పడి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని నల్లకుబేరులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం లేదా మారక పోవడం మీ ఇష్టం.. చట్టాన్ని పాటిస్తారా లేదా అన్నదీ మీ ఇష్టం కానీ.. చట్టంలోని కఠిన నిబంధనలు మాత్రం మిమ్మల్ని వదిలే అవకాశమే ఉండదు’ అని నల్లకుబేరులనుద్దేశించి అన్నారు. ‘మీ అక్రమ సొత్తును కాపాడుకోవడం కోసం పేదల జీవితాలతో చెలగాటం ఆడకండి.. ఒకవేళ దర్యాప్తు జరిగి నల్లసొత్తు వ్యవహారంలో అసలు గుట్టు బయట పడితే మీ వల్ల సదరు పేద ప్రజలే ఇబ్బందుల్లో పడతారు’అని అన్నారు. ఇంతగా ప్రభుత్వం హెచ్చరిస్తున్నా..కొందరు వ్యక్తులు తమ తప్పుడు మార్గాలను వదులుకోవడం లేదని, తమ అక్రమ సొత్తును, సంపదను, బినామీ ఆస్తులను వ్యవస్థలో భాగంగా మార్చేందుకే ప్రయత్నిస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అక్రమ సొత్తును కాపాడుకోవడానికి అక్రమ మార్గాలనే ఆసరా చేసుకుంటున్నారని, ఇందుకోసం పేద ప్రజల జీవితాలతోనూ చెలగాటమాడుతున్నారని అన్నారు. తన నిర్ణయం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా..వాటిని భరిస్తూ తనకు మద్దతునిస్తున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ తమ భవితను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలుస్తున్నారని మోదీ అన్నారు. దేశానికి నిజమైన సైనికుల్లా పనిచేసి దేశ యువత అవినీతి వ్యతిరేక పోరాటానికి సారధ్యం వహించాలని పిలుపునిచ్చారు. నగదు రహిత సమాజాన్ని సాధించడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోయినా ఆ దిశగా అడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.