రాష్ట్రీయం

ప్రజల మద్దతు లేక బంద్ విరమణ: దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: నోట్ల రద్దుపై గగ్గోలు పెడుతున్న విపక్షాలకు ప్రజల మద్దతు లేకపోవడం వల్లనే బంద్‌ను విరమించుకున్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టేందుకే ప్రధాని మోదీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో ఆర్ధిక అసమానతలు తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్ దేశం హర్షిస్తోందన్నారు.
కొద్దిమంది చేతుల్లో పొగైన దేశ సంపదను దేశ ప్రజలందరి కోసం వినియోగించేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని, న్యాయబద్దంగా సంపాదించిన వారు రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, అన్యాయంగా కోటాను కోట్లు వెనకేసుకున్న వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. నల్లధనం విషయమై ప్రధాని మాట్లాడితే గుమ్మడికాయల దొంగలు ఎవరూ ఉంటే భుజాలు తడుముకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఐఐటిలో విద్యనభ్యసించి ఐఆర్‌ఎస్ ఉద్యోగం చేసిన కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని తప్పుపడట్టడం దురదుష్టకరమన్నారు. అదేవిధంగా ప్రజల కోసమే తమ జీవితం అని మాట్లాడే కమ్యూనిస్టులు విలువలు మరిచి ప్రజలకు మేలు చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. క్యాన్సర్‌లా వ్యాపించిన అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించడానికి కొంత సమయం తప్పదన్నారు.
నగదు చెలామణిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, అందులో భాగంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 60 శాతం ఏటి ఎంలను రిక్యాలిబ్రేషన్‌ను పూర్తిచేసిందని, మరో వారం రోజుల్లో పరిస్థితులన్నీ సర్దుకుంటాయని దత్తాత్రేయ వివరించారు. పెద్ద నోట్ల రద్దుపై నిర్మాణాత్మక చర్చకు రావాలని ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో గందరగోళం సృష్టిస్తున్నాయని, ప్రజల్లో నవ్వులపాలైన ప్రతిపక్షాలు ఈ వ్యవహారంలో చేసేది ఏమీ లేక బంద్‌ను విరమించుకొని నిరసన కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నాయని ఆయన అన్నారు.