ఆంధ్రప్రదేశ్‌

కంటైనర్‌ను ఢీకొన్న బొలెరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లె, నవంబర్ 27: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ సమీపంలో ఒక మలుపు వద్ద ఆదివారం ఒక కంటైనరు, బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వి.కోట నుంచి రెవెన్యూ ఉద్యోగులు బొలెరో వాహనంలో మదనపల్లెలో జరిగే రెవెన్యూ సంఘం ఎన్నికల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనంలోని 8 మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో ప్రయాణిస్తున్న వి.కోట ఇన్‌చార్జి తహశీల్దార్ మురళి, జూనియర్ అసిస్టెంట్ హరినాథ్, అటెండర్ కృష్ణవేణి అక్కడికక్కడే మృత్యువు పాలయ్యారు. ఆర్‌ఐ జాన్‌సుందరం, సీనియర్ అసిస్టెంట్ బాలాజీరావు, అటెండర్ పిళ్లై, డ్రైవర్ ఆనంద్, లోకేష్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వి.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కుప్పం పిఇఎస్‌కు తరలించారు. పిఇఎస్‌లో ఆర్‌ఐ జాన్‌సుందరం చికిత్స పొందుతూ మృతి చెందారు. వి. కోట రెవెన్యూ సిబ్బంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో జిల్లా రెవెన్యూ శాఖ దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గాయపడ్డ వారిని చికిత్స కోసం వి.కోట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి గంగవరం సిఐ రవికుమార్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంటైనర్‌ను ఢీకొని నుజ్జునుజ్జయన బొలెరో వాహనం

సిఎం దిగ్భ్రాంతి

విజయవాడ, నవంబర్ 27: చిత్తూరు జిల్లా వి కోట మండలం కైగల్ దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురైన తహశీల్దార్ మురళి, జూనియర్ అసిస్టెంట్ హరి, అటెండర్ క్రిష్ణ వేణి, ఆర్‌ఐ జాన్ సుందరం మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల బాధిత కుటుంబాలను ఆదుకుంటుందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైర్ రెవెన్యూ సిబ్బంది మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన స్వామి నాథపిళ్లై, బాలాజీ, లోకేష్‌లకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుప్పం పిఇఎస్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.