ఆంధ్రప్రదేశ్‌

రంగు పడుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 28: మొన్నటి కల్తీకారం విక్రయాల దందా మరువకముందే మరో కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చింది. నిత్యం ప్రతి ఇంటా వాడే పసుపును కొందరు స్వార్థపరులైన వ్యాపారులు తమ జేబులు నింపుకునేందుకు కల్తీ చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం నిషేధించిన లెడ్‌క్రొమేట్ రసాయనాన్ని మరింత రంగు కోసం వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పసుపు మార్కెట్ యార్డుల్లో ఒకటైన గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్రంగా కోట్ల రూపాయల విలువైన టన్నులకొద్దీ కల్తీ పసుపు విపణిలోకి వచ్చి పడుతోంది. కల్తీ విషయంలో తయారీ నుంచి వినియోగదారుడికి చేరేవరకు మధ్యలో ఉండే ప్రతి ప్రభుత్వ విభాగం కళ్లకు గంతలు కట్టుకుని ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశాయి. పుచ్చిపోయిన పసుపుకొమ్ములను రేషన్ బియ్యంతో కలిపి మెత్తగా మర ఆడించి దానికి పసుపువర్ణం వచ్చేందుకు నిషిద్ధ రసాయనాలను రంగరించి కల్తీ పసుపు తయారు చేస్తున్నారు. దీన్ని అందమైన ప్యాకింగ్‌తో దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. ఇలా దుగ్గిరాల, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నెలకు 70 టన్నులకు పైగా కల్తీ పసుపు బయటి ప్రాంతాలకు వెళ్తోంది. పుచ్చిపోయిన పసుపుకొమ్ముల్లో ఫంగస్ నిల్వ పెరిగి బరువు తక్కువగా ఉండటంతో రేషన్ బియ్యాన్ని, రంగు కోసం ప్రమాదకర రసాయనాలనూ కలుపుతున్నారు. క్యాన్సర్‌కు గురిచేసే లెడ్‌క్రొమేట్‌ను ప్రతి మూడు క్వింటాళ్లకు 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు వాడుతున్నారు. పసుపులో నిల్వ ఉండే ఫంగస్ దీర్ఘకాలంలో మెదడుపై దుష్ప్రభావం చూపి పక్షవాతం, ఇతర అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉందని శాస్తవ్రేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పసుపు యార్డు చుట్టుపక్కల సుమారు 6 మిల్లుల్లో భారీగా కల్తీ పసుపును తయారుచేసి బయటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ వ్యాపారులు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. మిల్లుల నుంచి సైకిళ్లు, మోటారు బైక్‌లు, ఆటోల ద్వారా దుగ్గిరాలలోని పార్సిల్ కార్యాలయాలకు చేర్చే వ్యాపారులు అక్కడి నుంచి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నాణ్యమైన కిలో పసుపు తయారీకి 110 రూపాయలు ఖర్చవుతుండగా కల్తీ పసుపు తయారీకి 40 రూపాయలు మాత్రమే వ్యయం కావడం గమనార్హం. ఇలా ఒక్క కిలోకే 70 రూపాయలు మార్జిన్ చూసుకునే వ్యాపారులు వేల కిలోలను తయారుచేసి లక్షాధికారులుగా మారుతున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం, వ్యాపారులతో లాలూచీపడటంతో అధిక శాతం కల్తీ పసుపు మార్కెట్‌ను ముంచెత్తుతోంది. పర్యవసానంగా పసుపు తయారీకి పేటెంట్‌గా ఉన్న దుగ్గిరాల పేరు మసకబారే ప్రమాదం ఏర్పడింది.

చిత్రం... మర ఆడించిన అనంతరం రాసిగా పోసిన కల్తీ పసుపు. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అమ్మకానికి సిద్ధవౌతున్న కల్తీ పసుపు