రాష్ట్రీయం

కొత్తగా టిఏఎస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణకు ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టిఏఎస్- టాస్) ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై పరిశీలనకు ఇప్పటికే మున్సిపల్ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజి గోపాల్ నేతృత్వంలో కమిటీని సిఎం కెసిఆర్ నియమించారు. వివిధ ఉద్యోగ సంఘాలు, పరిపాలనారంగంలో నిపుణులు, ఆర్థికవేత్తలు తదితరులతో కమిటీ విస్తృతంగా చర్చలు జరుపుతోంది. అఖిల భారత సివిల్ సర్వీసెస్ (ఏఐఎస్) తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (టాస్) ఏర్పాటు ప్రతిపాదనను కమిటీ పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా పరపాలనాపరమైన ఉన్నతాధికారులను ఏఐఎస్ నుండి కేంద్రం వివిధ రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఇందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) తదితర విభాగాలు ఉన్నాయి. సరిగ్గా ఇదే విధానంలో టాస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 అధికారులను నియమిస్తున్నారు. పోటీ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా అభ్యర్థులను వివిధ రంగాలకు కేటాయిస్తున్నారు. మొట్టమొదటి ప్రాధాన్యత రెవెన్యూ శాఖకు ఇస్తున్నారు. మిగతా వారిని వివిధ శాఖలకు కేటాయిస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా ఎంపికయ్యే వారిని ఆర్‌డిఓలు, డిప్యూటీ తహశీల్దారులుగా రెవెన్యూలో, ఇతర శాఖల్లో వివిధ హోదాల్లో నియామకం అవుతున్నారు. ఒక శాఖలో చేరిన అభ్యర్థులు పదవీవిరమణ పూర్తయ్యే వరకు అదేశాఖలో పనిచేస్తున్నారు. ప్రతి శాఖలో కార్యదర్శులు/కమిషనర్లు/డైరెక్టర్లుగా అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్లుగా ఐఎఎస్‌లకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. కిందిస్థాయి అధికారులుగా అంటే అడిషనల్ డైరెక్టర్ల స్థాయి వరకు గ్రూప్ వన్ అధికారులు నియామకం అవుతున్నారు. రెవెన్యూ శాఖలో నియామకం అయ్యేవారు జాయింట్ కలెక్టర్ల వరకు ప్రమోషన్లు పొందుతున్నారు. మరికొంత మందికి సీనియారిటీని అనుసరించి ఐఎఎస్ హోదా లభిస్తోంది.
వివిధ శాఖలకు చెందిన గ్రూప్-1 అధికారులను ఒకే చత్రం పరిధిలోకి తీసుకువచ్చేందుకు టాస్ (తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫ్రెష్ క్యాండిడేట్స్‌తో పాటు సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు పొందే వారిని టాస్ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందిన నలుగురు సభ్యుల బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిపాలనాపరమైన పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు పర్యటిస్తోంది. తెలంగాణ తహశీల్దారుల సంఘం ప్రతినిధులు లచ్చిరెడ్డి, రాజాగౌడ్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయిస్ (ట్రెస్సా) అధ్యక్షుడు ఎం. శివశంకర్, ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డిలతో కూడిన బృందం పర్యటన చేస్తోంది. ఇప్పటికే ఈ కమిటీ కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించింది. మంగళవారం ఈ కమిటీ గుజరాత్‌లో పర్యటిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల పర్యటన తర్వాత ఈ కమిటీ ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
ఇప్పటికే గ్రూప్-1 అధికారుల సంఘం తరఫున ఒక బృందం దాదాపు ఆరు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చింది. ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించింది. వివిధ రూట్లలో వస్తున్న నివేదికలన్నింటినీ క్రోఢీకరించి ఈ కమిటి తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కమిటీ నివేదిక ఎప్పుడు రూపొందుతుందన్న అంశం కమిటీ సభ్యుల అధ్యయనంపై ఆధారపడి ఉంటుంది.