ఆంధ్రప్రదేశ్‌

‘గంటా’తో తంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 29: ఆయన కీలకమైన విద్యాశాఖకు మంత్రి. అందులోనూ సెట్లపై కసరత్తు జరుగుతున్న సమయం. అన్ని సెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? వద్దా? అంత సామర్థ్యం ఉన్న సంస్థలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలో మంత్రిగారు మీడియాతో భేటీ అవుతారని సమాచారం వచ్చింది. వచ్చిన అరగంటలోనే మీడియా ప్రతినిధులంతా వెళ్లినా రెండున్నర గంటల వరకూ మంత్రిగారు పత్తాలేరు. పోనీ మంత్రి మీడియా భేటీ రద్దయిందని సొంత శాఖ అధికారులేమైనా సమాచారం ఇచ్చారా అంటే అదీ లేదు. చివరాఖరకు ఈ ఆలస్యం అలవాటు ఇక్కడే కాదు. విశాఖలోనూ మంత్రిగారికి ఉందని తెలుసుకుని వెళ్లిపోవలసి వచ్చింది. ఇదీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి. అన్ని సెట్లను ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశంపై జరుగుతున్న పురోగతిని వివరించేందుకు, మంగళవారం 2గంటలకు స్టేట్‌గెస్ట్‌హౌస్‌కు రావాలని 1.18కి మీడియాకు సమాచారం ఇచ్చారు. దానితో 1.30కే మీడియా ప్రతినిధులు స్టేట్‌గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. సమయం 3.30 అవుతున్నా మంత్రి గారు పత్తాలేరు. పోనీ సమావేశం ఉందో లేదో కూడా సమాచారం ఇవ్వలేదు. దీనితో విసిగిపోయిన మీడియా ప్రతినిధులు 4 గంటల వరకూ చూసి వెళ్లిపోయారు. మీడియా సమావేశాలు, ప్రెస్‌నోట్ల వ్యవహారాలు చూసేందుకు ఒక లైజనింగ్ ఆఫీసర్, ఒక పీఆర్‌ఓ ఉన్నారు. వీరికి వేలల్లోనే జీతాలు ఇస్తున్నారు. పీఆర్‌ఓకు ఇంకా ఎక్కువే జీతాలు ఇస్తున్నారు. కానీ వారి నుంచి కూడా సమాచారం లేకపోవడం బట్టి మంత్రుల వద్ద పనిచేసే ఈ వ్యవస్థ ఎంత చురుగ్గా ఉందో స్పష్టమవుతోంది.