రాష్ట్రీయం

నేడు రాజీవ్ శర్మ పదవీ విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం పదవీ వరమణ చేయనున్నారు. ఈయన స్థానంలో రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తిస్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామక ఉత్తర్వులు వెలువడే వరకు ప్రదీప్ చంద్ర ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజీవ్ శర్మకు సచివాలయ ప్రాంగణం బతుకమ్మ గ్రౌండ్‌లో బుధవారం సాయంత్రం 3 గంటలకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినట్టు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా ఉండగా కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర నియమకానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మే నెలాఖరుననే పదవీ విరమణ చేయగా, ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి మేరకు రెండు పర్యాయాలు మూడు నెలల చొప్పున కేంద్ర హోంశాఖ గడువు పొడిగించిన విషయం తెలిసిందే. పదవీ విరమణ చేయనున్న రాజీవ్ శర్మ సేవలను వినియోగించుకోనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రిమండలి సమావేశంలో ప్రకటించారు. విధానాల రూపకల్పనలో ప్రభుత్వ సలహాదారుగా రాజీవ్ శర్మను నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు డిసెంబర్ ఒకటవ తేదీన వెలువడనున్నట్టు తెలుస్తోంది.