రాష్ట్రీయం

ఫస్టునాడూ కష్టాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 1: ఒకటోతారీఖు వచ్చింది. సాయంత్రం వరకూ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెల్‌ఫోన్ మెసేజీలు చూడటంతోనే సరిపోయింది. మధ్యాహ్నానికి కొందరికి, సాయంత్రానికి ఇంకొందరికి సెల్‌ఫోన్ గంటలు మోగాయి. కానీ.. ఏం ఉపయోగం? దానిని నగదుగా మార్చుకునే అదృష్టం లేకపోయింది. ఏటిఎంలు వెక్కిరిస్తుంటే బిక్కముఖం వేయాల్సిన దుస్థితి. కొన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులయితే అసలు జీతాల గంట మోగనేలేదు. కొన్ని లిమిటెడ్ కంపెనీలు జీతాలిచ్చినా వాటిని నగదుగా మార్చుకోలేని నిస్సహాయత. డిసెంబర్ ఒకటి వేతన జీవుల వెతలు ఇవి. డిసెంబర్ ఒకటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు చివరికి నిరాశే మిగిలింది.
డిసెంబర్ ఒకటిన జీతాలిచ్చే అవకాశాలున్నందున, కనీసం ఆరోజైనా ఏటిఎం, బ్యాంకుల్లో డబ్బు ఎక్కవ శాతం అందుబాటులో ఉంచుతారనుకున్న వేతన జీవులను ఆ రెండూ ఖాళీగా వెక్కిరించాయి. ఫలితంగా జేబులో ఏటిఎం కార్డు ఉన్నా, చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి వేతన జీవులను వేదనకు గురిచేశాయి. వెలగపూడి సచివాలయంలో ఉద్యోగులకు పదివేల రూపాయల నగదు ఇస్తూ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో సచివాలయ ఉద్యోగులు కొంత ఊరట పొందారు. ఆంధ్రాబ్యాంక్‌లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో 2 వేల రూపాయల నోట్లు ఇవ్వగా, ఎస్‌బిఐలో మాత్రం కొంత ఆలస్యం జరిగినా సాయంత్రానికి ఇచ్చారు. చాలామంది ఉద్యోగుల అకౌంట్లు హైదరాబాద్‌లో ఉండటంతో వాటిని వెరిఫికేషన్ కోసం హైదరాబాద్‌కు పంపించడం వల్ల ఆలస్యం జరిగింది. నగదు చిక్కుల నుంచి తమకు కొంతయినా ఊరటనిచ్చినందుకు ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు మాత్రం సమస్యలు తప్పలేదు. లిమిటెడ్ కంపెనీలు కొన్ని గురువారం జీతాలు అకౌంట్లలోకి వేసినప్పటికీ, ఉద్యోగులకు వాటిని నగదుగా మార్చుకునే అవకాశం రాలేదు. దానితో ప్రైవేటు వడ్డీలకు ఎగబడ్డారు. మామూలుగా ఒకటిన ఇచ్చే మరికొన్ని ప్రైవేటు కంపెనీలు ఈసారి జీతాలివ్వకపోవడం నిరాశ మిగిలింది.

చిత్రం..నగదు అందుకున్న సెక్రటేరియట్ ఉద్యోగినుల ఆనందం