రాష్ట్రీయం

జనవరినుంచి నగదు రహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో కొత్తగా 3.5 లక్షల మందికి సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల దాదాపు 800 కోట్ల రూపాయల మేరకు ఆదాయం కోల్పోయామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి నుంచి పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పి.నారాయణ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఎక్కువ మందికి మేలు కలిగేలా కొత్తగా పింఛన్లు జారీ చేయాలని ఈ సమావేశం నిర్ణయించిందన్నారు. పెద్ద నోట్లు రద్దు వల్ల రాష్ట్ర ఖజానాకు 800 కోట్ల మేరకు ఆదాయం కోల్పోయిందని మంత్రి వర్గం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నష్టం జనవరి నాటికి 1500 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. జిల్లా, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ఆన్‌లైన్ లావాదేవీలపై దృష్టి సారించాలని, డిసెంబర్‌లోగా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎపి పర్స్‌లో 13 రకాలుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేందుకు వీలుగా రూపొందించిన యాప్‌పై కూడా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
అమరావతి, పోలవరం వేగవంతం
రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. రోజువారీ సమీక్షల ద్వారా పనుల ప్రగతిని సమీక్షించాలని, అవసరమైన నిధులు రాబట్టుకోవడం, తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. బిఆర్ షెట్టి హెల్త్ అండ్ రీసెర్చి సంస్థకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఒక మెడికల్ వర్సిటీ, వైద్య పరికరాల తయారీ విభాగం, త్రి స్టార్ హోటల్, నేచురోపతి, యోగా ఆసుపత్రి, కనె్వన్షన్ హాల్, ఒక బిజినెస్ స్కూల్‌ను 4000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకువచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వు మేరకు కీసరగుట్టలోని కంచికచర్లలోని 340 ఎకరాలను, విజయవాడలోని 8 చోట్ల ఉన్న స్థలాలను వేలం వేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రులు తెలిపారు. అమరవాతి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు హడ్కో నుంచి 1859 కోట్ల రూపాయల మేరకు రుణం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించారు. పండిట్ నెహ్రు బస్ కాంప్లెక్సు నుంచి నిడమానూరు, పెనమలూరుకు నిర్మించనున్న ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయం 7212 కోట్ల రూపాయలు కాగా, అందులో 3489 కోట్ల రూపాయల మేరకు రుణం సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. జైకా ఆర్థిక సాయాన్ని తిరస్కరించామని, ప్రాన్స్‌కు చెందిన ఒక సంస్థ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకువచ్చిందని, దానే్న ఖరారు చేయనున్నామన్నారు. అనంతపురం మడకశిర, చిత్తూరు జిల్లా బైరుపల్లిలో ఇండ్రస్టియల్ పార్క్ లేదా మల్టీ ప్రోడక్టు సెజ్ ఏర్పాటుకు వీలుగా ఎపిఐఐసికి భూ కేటాయింపును కేబినెట్‌లో ఆమోదించారు. చేనేత పరిశ్రమకు సంబంధించి వస్త్రాలు, నూలు కొనుగోలుకు క్యాష్ క్రెడిట్ పరిమితిని 58.32 కోట్ల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భూ సేకరణకు వీలుగా ఎపిఐఐసి 5000 కోట్ల రూపాయలను రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీని కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పరిశ్రమకు కోర్టు కేసుల కారణంగా ఇబ్బందులు వస్తే, నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలను సేల్ డీడ్‌లో చేర్చేందుకు ఎపిఐఐసికి అనుమతి ఇచ్చారు.
బాలమురిళికృష్ణకు నివాళి
సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణకు కేబినెట్ నివాళులర్పించింది. బాల మురళి అసామాన్య ప్రతిభా వంతుడని, కర్నాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాని శ్లాఘించింది.

చిత్రం..గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు