రాష్ట్రీయం

పూర్తికాని టెన్త్ సిలబస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: పదో తరగతి పరీక్షల షెడ్యూలు ఖరారైనా, హాల్‌టిక్కెట్లు సిద్ధం అవుతున్నా, తెలంగాణలోని స్కూళ్లలో పదో తరగతి పరీక్షల సిలబస్ పూర్తికాలేదు. నూరు శాతం సిలబస్ ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి కావల్సి ఉండగా, డిసెంబర్ మొదటి వారానికి కనీసం 80 శాతం సిలబస్ పూర్తికావాల్సి ఉంది. కాని కనీసం 50 నుండి 60 శాతం సిలబస్ కూడా పూర్తికాలేదు. దాంతో ప్రశ్నాపత్రాల్లో చాయిస్‌ను దృష్టిలో ఉంచుకుని పైపైన కొన్ని పాఠాలను పూర్తి చేసి సిలబస్ పూర్తి చేశామని మమ అనిపించాలని టీచర్లు చూస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంపై రెండేళ్లు గడుస్తున్నా టీచర్లకు సైతం సమగ్ర అవగాహన లేకపోగా, విద్యార్థుల్లో కూడా గందరగోళం పోలేదు. యూనిట్ టెస్టులకు బదులు ఫార్మేటివ్ అసెస్‌మెంట్, క్వార్టర్లీ, హాఫ్‌ఇయర్లీ, మెయిన్ పరీక్షలకు బదులు సమ్మిటివ్ అసెస్‌మెంట్ నిర్వహిస్తున్నారు. నాలుగు ఫార్మెటివ్ అసెస్‌మెంట్లు, మూడు సమ్మిటివ్ అసెస్‌మెంట్లు నిర్వహించాల్సి ఉండగా, అందులో ఈసారి సమ్మిటివ్ అసెస్‌మెంట్లు కుదించారు. 9వ తరగతి వరకూ సాధారణంగా పరీక్షలు రాసిన విద్యార్థులకు అకస్మాత్తుగా పదో తరగతిలో సిసిఇ పద్ధతి పేరుతో ఈ కొత్త విధానం అమలుచేయడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. మరో పక్క టీచర్లకు సైతం ఇదో పెద్ద పనిభారంగా తయారైపోయింది. నిర్మాణాత్మక మూల్యాంకనం ప్రతి సబ్జెక్టులో 50 మార్కులకు నిర్వహించి, నాలుగు మార్లు అన్ని సబ్జెక్టుల్లో 200 మార్కులకు లెక్కకట్టి అనంతరం వాటిని ప్రతి సబ్జెక్టులో రెండున్నర మార్కులకు గణించాల్సి ఉంటుంది. అంటే ప్రతి సబ్జెక్టులో ప్రయోగశాల పనులకు నాలుగు పరీక్షల్లో 200 మార్కులకు సాధించిన మార్కులను తీసుకుని వాటిని రెండున్నర మార్కులకు పాయింట్ల పట్టికలో గణించాలి. అలాగే రాత అంశాలకు, ప్రాజెక్టు పనులకు, లఘుపరీక్షలకు మార్కులు కేటాయించాల్సి వస్తుంది. విద్యార్థులకు విషయ అవగాహన, ప్రశ్నలు అడగడం, పరికల్పనలు చెయ్యడం, అర్థం చేసుకోవడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, బొమ్మలు, భావప్రసారం, ప్రతిస్పందన, ప్రశంస, నిజజీవితంలో వినియోగం, సున్నితత్వం తదితర అంశాలను పరిగణించాల్సి ఉం టుంది. వాస్తవానికి తరగతి గదిలో ఈ ప్రక్రియలు పూర్తికాకుండానే ఫార్మేటివ్ పరీక్షలు ముగిసి సమ్మిటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.