రాష్ట్రీయం

హిందువులకు ‘దివ్య దర్శనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కల్పించనుంది. ఎప్పుడూ తీర్థయాత్రలు చేయని నిరుపేద హిందువుల కోసం ‘దివ్యదర్శనం’ అనే కార్యక్రమాన్ని జనవరి 2 నుంచి అమలు చేయనుంది. ఇప్పటివరకు మక్కా వెళ్లేందుకు ముస్లింలకు, జెరూసలెం వెళ్లేందుకు క్రైస్తవులకు ప్రభుత్వం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. దివ్యదర్శనం కార్యక్రమంతో బడుగు, బలహీన వర్గాలకు తీర్థయాత్రల భాగ్యాన్ని కలిగిస్తోంది.
దేవాదాయ శాఖ ప్రారంభిస్తున్న ఈ తీర్థయాత్రలకు వెళ్లదలచిన వారు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఆసక్తిగలవారు www.apendowments.gov.in ధ్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా దరఖాస్తును నేరుగా సంబంధిత ఎమ్మార్వో కార్యాలయంలోని డ్రాప్ బాక్స్‌లో వేయవచ్చు. దివ్యదర్శనం కింద అరసవెల్లి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, అమరావతి, మంగళగిరి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, అహోబిలం, కసాపురం, ఒంటిమిట్ట, జొన్నవాడ, శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం క్షేత్రాల్లోని ఏదేని నాలుగు క్షేత్రాలకు తీసుకువెడతారు. తీర్థయాత్రలకు ఆర్టీసీ బస్ సర్వీసులను దేవాదాయ శాఖ వినియోగిస్తుంది. అయితే తీర్థయాత్రలకు వెళ్లేవారికి ఎవరూ కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఏటా ఒక్కో జిల్లానుంచి పదివేల మందిని తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. వసతి, భోజన సదుపాయాలతో పాటు దర్శనం కలిగించడం, తీర్థప్రసాదాలు అందించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది.
ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఐదుగురిని మాత్రమే తీసుకెళ్తారు. ముందుగా అనుకున్న విధంగా ఒక్కో జిల్లానుంచి పదివేల మందిని విడతల వారీగా తీర్థయాత్రలకు తీసుకెళ్లనున్నారు.