రాష్ట్రీయం

రాష్ట్రానికే మీరే ఆదర్శం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 2: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. శుక్రవారం సిఎం దత్తత గ్రామాల్లో జరుగుతున్న వివిద అభివృద్ది పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 20లోపు సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధమవుదామని, అప్పటిలోగా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో వైఫై సేవలు, ఇంటింటికి తాగునీరు, విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వాలని, అలాగే అంతర్గత రోడ్లవెంట మొక్కలు నాటాలని, పూలు, నీడనిచ్చే చెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అంతేగాకుండా ఎర్రవల్లిలో చేపట్టిన మైసిరెడ్డికుంట మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని, కళ్యాణ మండపం పనులు పూర్తిచేసి అందుబాటులోకి వచ్చేలా దృష్టి సారించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులపై అధికారులతోపాటు విడిసీ సభ్యులకూ ఎంతో బాధ్యత ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌లు బాగ్యబాల్‌రాజ్, బాల్‌రెడ్డి, విడిసి చైర్మెన్‌లు రాంచంద్రం, కిష్టారెడ్డి, పోలీస్ కమిషనర్ శివకుమార్‌లతోపాటు ఆయా శాఖల అధికారులు శ్రీనివాస్‌రావు, మల్లయ్య, పరమేశం, పట్టాబిరామారావు పాల్గొన్నారు.

చిత్రం.. క్షేత్రస్థాయలో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రికి వివరిస్తున్న కలెక్టర్