రాష్ట్రీయం

ఆ దృశ్యాలను తొలగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: వంగవీటి సినిమా ట్రైలర్ నుంచి అభ్యంతరకరమైన దృశ్యాలను, పాటలను తొలగిస్తామని ఆ సినిమా నిర్మాత హైకోర్టుకు లిఖితపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలైతే సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టినట్లవుతుందని, సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అనంతరం హైకోర్టు ఈ పిటిషన్‌ను పరిష్కరించినట్లు ప్రకటించింది. ఈ కేసులో సినిమా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ తరఫున న్యాయవాది కోర్టుకు ఈ అఫిడవిట్‌ను సమర్పించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, ఈ సినిమాలో అవాస్తవికత ఉందని, సత్యదూరమైన అంశాలను చేర్చారని వాదనలు వినిపించారు. ఈ సినిమాలో పిటిషనర్ రాధాకృష్ణ తండ్రి వంగవీటి మోహన్ రంగారావు జీవితానికి సంబంధించిన సంఘటనలు, కథ ఉందన్నారు. కోస్తా జిల్లాల్లో రెండు సామాజికవర్గాల మధ్య విద్వేషం పెచ్చుమీరుతుందన్నారు. ఈ విషయమై నిర్మాత న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో అడిగారు. సామాజిక మాధ్యమాల నుంచి అభ్యంతరకరమైన దృశ్యాలు, పాటలను తొలగించామని కోర్టుకు నిర్మాత తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయాలను రికార్డు చేసిన తర్వాత పిటిషన్‌లోని అంశాలను పరిష్కరించినట్లు న్యాయమూర్తి ప్రకటించారు.