రాష్ట్రీయం

భారతీయుల వీసాలపై న్యూజిలాండ్ కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: భారతీయులకు కేటాయించే వీసాలపై న్యూజిలాండ్ కోత విధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది శాపంగా మారనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో న్యూజిలాండ్‌లో చదువుకునే విద్యార్థులకు కేటాయించిన వీసాలు సగానికి తగ్గాయి. కేవలం జూలై నుండి అక్టోబర్ వరకూ న్యూజిలాండ్ భారతీయ విద్యార్థులకు 3102 వీసాలను మాత్రమే మంజూరు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 6462 మంది న్యూజిలాండ్‌లో చదువులకు వెళ్లారు. న్యూజిలాండ్ చదువులకు వెళ్తున్న వారిలో సగం మందికి పైగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే కావడం విశేషం.
చాలామంది విద్యార్థులు ఇటు చదువుల్లోనూ, అటు ఆర్థిక వనరుల్లోనూ లోటుతో న్యూజిలాండ్ చేరుకుంటున్నారని ఆ దేశం వాదిస్తోంది. చాలా తక్కువ నిధులతో న్యూజిలాండ్ చేరుకుంటున్నారని, పోనీ చదువుల్లో కూడా ముందంజలో ఉండటం లేదని, ఆంగ్లభాషా ప్రావీణ్యం లేకపోవడం వల్ల అనేక బ్యాక్‌లాగ్స్ మిగిలిపోతున్నాయని పేర్కొంటున్నారు. న్యూజిలాండ్‌లోని దాదాపు 16 శాతం విద్యాసంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆక్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సంస్థ అధికార ప్రతినిధి పాల్ చాలమర్స్ మాట్లాడుతూ భారత్ నుండి వస్తున్న విద్యార్థుల విషయంలో న్యూజిలాండ్ ముంబై కాన్సులేట్ కార్యాలయం సవ్యంగా వ్యవహరించడం లేదని, దరఖాస్తుల భర్తీలో విద్యార్థులు తప్పులు చేస్తున్నారన్నారు.