రాష్ట్రీయం

అందని ఆసరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సామాజిక పింఛన్ల కింద ఎకాఎకి రూ.397 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ నిధులు బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి. కానీ చిల్లర కష్టాలతో పింఛనుదారులకు నగదు చెల్లింపులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పింఛనుదార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయా క్యాటగిరీలను బట్టి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ప్రభుత్వం పింఛను చెల్లిస్తోంది. దీనివల్ల బ్యాంకులకు నగదు చెల్లింపుల్లో కష్టాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు కలుపుకుని 35.96 లక్షలమంది పింఛనుదార్లు ఉన్నారు. ఇందులో 17.81 లక్షల పింఛన్లు పోస్ట్ఫాసుల ద్వారా, 13.63 లక్షల పింఛన్లు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు. కాగా 4.54 లక్షల మందికి పంచాయితీ కార్యదర్శుల ద్వారా పింఛన్లు అందుతున్నాయి. వీరికి బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో అకౌంట్లు లేవు. బ్యాంకులు, పోస్ట్ఫాసులు చాలాచోట్ల అందుబాటులో ఉన్నంతవరకు చిల్లర నగదును పింఛనుదారులకు చెల్లిస్తున్నాయి. కాగా ఏ అకౌంట్ లేని పింఛనుదార్లకు మాత్రం చెల్లింపుల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. కేంద్రం గత నెల 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత అందుబాటులో నగదు లభ్యత లేకపోవడం వల్ల పింఛనుదార్ల చెల్లింపుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఏ అకౌంట్లు లేని 4.52 లక్షల మంది పెన్షనర్లతోనే అసలు సమస్య తలెత్తుతుంది. పోస్టల్ అకౌంట్లు ఉన్నవారు బయోమెట్రిక్ విధానంలో పింఛను తీసుకుంటున్నారు. బ్యాంకు అకౌంట్ల ఉన్నవారికి వారి ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది.
కానీ ఏటిఎంలలో సరిపడా నగదు లేకపోవడం, బ్యాంకుల్లో నగదు కొరత వల్ల కూడా ఖాతాలు ఉన్నవాళ్లకూ జాప్యమవుతోంది. ఇంతవరకు 21.72 లక్షల మందికి రూ.236.81 కోట్ల పింఛను సొమ్ము అందిందని, ఇంకా 14.24 లక్షల మందికి రూ.160 కోట్ల వరకూ అందాల్సి ఉందని సమాచారం. ఈనెల 7లోగా అర్హులైన వారందరికీ పించన్లు చెల్లించాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. ఇంతవరకు ఏ పించను లేనివారు బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు సెర్ఫ్ ఏజన్సీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 700కుపైగా ఉన్న గ్రామ పంచాయితీల్లో 1.25 లక్షల మంది పించనుదార్లకు సంబంధించి పోస్ట్ఫాసు అకౌంట్లను వెంటనే తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.