రాష్ట్రీయం

డిజిటల్‌కు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబాలు, సామాన్యులు నగదురహిత వ్యవహారాలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ కోరారు. నగదురహిత కార్యకలాపాలను కొనసాగించే అంశంపై అవగాహన కల్పించేందుకు సచివాలయంలో ఉద్యోగులకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. కేంద్రం 500, వెయ్యి నోట్లను రద్దు చేయడంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజలు మారాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో లావాదేవీలన్నీ డిజిటల్ తరహాలోనే కొనసాగుతాయని వివరించారు. నోట్ల రద్దువల్ల సమాజంలో విప్లవాత్మక మార్పు వస్తోందని కొత్త సిఎస్ ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక పర్యాయం నిర్ణయం తీసుకున్న పిదప, అదే విధానం కొనసాగుతుందని వివరించారు. ఈ పరిస్థితిలో సమాజంలో అందరూ ఈ-బ్యాంకింగ్‌కు అలవాటుపడక తప్పదని, ఇక నుంచి ఎలక్ట్రానిక్ లావాదేవీలే సాగుతాయని స్పష్టం చేశారు. ఈ-బ్యాంకింగ్ విధానంలో ఆర్థిక రక్షణకు సంబంధించిన అనేక అంశాలు దాగి ఉన్నాయన్నారు. ఇప్పటికే మన సమాజంలో కొత్తతరం జనరేషన్ అంతా డిజిటల్ లావాదేవీలు జరుపుతోందని, అలాగే మిగతా అందరూ ఇదే మార్గంలో వెళ్లక తప్పదన్నారు. దీన్ని ఒక ఉద్యమంగా మారిస్తే, రాష్ట్రం సులువుగా అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్థిక శాఖను ప్రదీప్ చంద్ర అభినందించారు. నగదురహిత లావాదేవీలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ మెంబర్, మున్సిపల్ వ్యవహారాల కార్యదర్శి, సమాచార పౌరసంబంధాల కమిషనర్ నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, బ్యాంకింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్లకు ఆదేశాలు
నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను కొత్త సిఎస్ ప్రదీప్ చంద్ర ఆదేశించారు. శనివారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్లాస్టిక్ డబ్బు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. బ్యాంకుల నుంచి ప్రజలు తమ డబ్బు తీసుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

చిత్రం..కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కొత్త సిఎస్ ప్రదీప్ చంద్ర