ఆంధ్రప్రదేశ్‌

త్వరలో 400 వైద్యుల పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 3 : రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల కొరత నివారించడానికి అవుట్ సోర్సింగ్ పద్దతిపై త్వరలోనే 400 డాక్టర్ల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని రాష్ట్ర విధాన పరిషత్తు కమిషనర్ ఎన్ దుర్గా ప్రసాద్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిని సోమవరం మధ్యాహ్నం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత ముఖ్యంగా మహిళా విభాగంలో డెలివరీ కేసుల తీరుపై ఆయన స్వయంగా అందరినీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయడానికి డాక్టర్లు పెద్దగా ముందుకు రావడం లేదని, ఇటువంటి స్థితిలో కాంట్రాక్టు పద్దతిపై డాక్టర్లను తీసుకోవడానికి చర్యలు తీసుకున్నామని నెలకు లక్ష రూపాయల వరకూ వేతనం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని అదే గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి ముందుకు వస్తే డాక్టర్లకు నెలకు లక్షా 50 వేల రూపాయలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని ఇప్పటికే ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టి రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను వెంటనే నిర్వహించగలుగుతున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, త్వరలోనే 17 కొత్త కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పధకం కింద అవసరమైన వైద్య సేవలు అందించేలా తగు ఏర్పాట్లు చేస్తున్నామని చాలా మంది కార్పొరేట్ వైద్య శాలలకు వెళుతున్నారని, అలా కాకుండా అనుభవం గల వైద్యుల చేత అవసరమైన వైద్యాన్ని ఉచితంగానే ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తామని చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి పనితీరు చాలా సంతృప్తికరంగా వుందని, ముఖ్యంగా ప్రతీ నెలా 500 నుండి 560కు పైగా కాన్పులు జరగడం ఈ ఆసుపత్రి ప్రత్యేకతని, గైనకాలజిస్టు డాక్టర్ పద్మ, ఇతర బృందం సభ్యులను నర్సింగ్ స్ట్ఫాను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని చెప్పారు. సమాజంలో అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భ6దత ప్రభుత్వాసుపత్రిలో చేకూరుస్తారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని ముఖ్యంగా క్యాష్ లెస్ ప్రసవాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని గర్భిణీ స్ర్తి ఆసుపత్రికి వస్తే ఒక్క రూపాయి ఖర్చు కూడా కాకుండా స్వేచ్ఛగా కాన్పు జరిపి తల్లి-బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడడమే కాకుండా బిడ్డకు అవసరమైన కిట్‌ను కూడా ఉచితంగా సమకూరుస్తామని, జనని సురక్షా యోజన పధకం ద్వారా గర్భిణీ స్ర్తికి అవసరమైన చేయూతను కూడా అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వైద్య ఆరోగ్య పధకాలపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి సరైన అవగాహన లేదని తన పరిశీలనలో తేలిందని, త్వరలోనే అన్ని ప్రభుత్వాసుపత్రులలో దిగువుస్థాయి సిబ్బందికి ఆరోగ్య పధకాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగించడానికి ప్రత్యేక ఓరియంటేషన్ క్లాసులను నిర్వహిస్తామని చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వౌలిక వసతులు కల్పించడంలో దాతలు, ప్రజా ప్రతినిధులు చూపిస్తున్న చొరవ, కృషి ప్రశంసనీయమని ఇదే విధంగా అన్ని ప్రాంతాలలో దాతలు ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్య శాలలకు ధీటుగా ఉత్తమ సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు.