రాష్ట్రీయం

అంకురోత్పత్తిపై 5 నుంచి సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: విత్తన నమూనా, అంకురోత్పత్తిపై ఐదురోజుల ప్రత్యేక వర్క్‌షాప్ ఈ నెల ఐదున హైదరాబాద్‌లోని పార్క్‌హోటల్‌లో నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. శనివారం ఇక్కడ అధికారిక ప్రకటన చేస్తూ, తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాల పరీక్ష అసోసియేషన్ (ఇస్తా) ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో విత్తనాల నాణ్యత, ప్రమాణాలు, అంచనావంటి అంశాలపై ఆరుదేశాల నుండి హాజరవుతున్న నిపుణులతో పాటు భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 33 మంది నిపుణులు పాల్గొని ఉపన్యాసాలు ఇస్తారని ఆయన వివరించారు. స్కాట్‌లాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, థాయిలాండ్ తదితర దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ విత్తనభాండాగారంగా గుర్తించేందుకు ఈ వర్క్‌షాప్ ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విత్తన పరీక్షా లాబోరేటరీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ఆరుకోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ లాబోరేటరీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు ‘ఇస్తా’ అక్రిడిటేషన్ లభించిందని వివరించారు. తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థను రెఫరల్ డెసిగ్నేటెడ్ అథారిటీగా నియమించారని వివరించారు. తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకులు కె. కేశవులు ఇస్తా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం సంతోషకరమని పార్థసారథి పేర్కొన్నారు.