రాష్ట్రీయం

బాలుడిని చంపిన చిరుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఒక చిరుత శనివారం 12 ఏళ్ల బాలుడిని చంపింది. దీంతో ఆగ్రహించిన గ్రా మస్థులు దాన్ని వెంటాడి హతమార్చారు. బస్తర్ జిల్లా కుండా గ్రా మంలోకి శనివారం ఉదయం ఒక చిరుతపులి ప్రవేశించింది. ఆరుబయట ఆడుకుంటున్న 12 ఏళ్ళ బాలుడిపై దాడి చేసి చంపింది. చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించిన సంగతి తెలుసుకున్న గ్రామస్థులు అంతా కలిసి దాని వెంటపడ్డారు. గ్రామంలోని ఓ ఇంటిలోకి దూరి మంచం కింద నక్కింది. బాలుడిని చంపడంతో ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు దాన్ని కొట్టి హతమార్చారు.

చిత్రం...బాలుడిని చంపి మంచం కింద నక్కిన చిరుతపులి