రాష్ట్రీయం

త్వరలో గ్రూప్ 3 నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 4: గ్రూప్ 3 నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరుకు జారీ చేస్తామని ఎపిపిఎస్‌సి చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. విశాఖ వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. గ్రూప్ 3 ద్వారా 1,055 పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఎపిపిఎస్‌సి గ్రూప్ 2 ద్వారా 984 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని, గ్రూప్ 2కి ఇప్పటివరకూ 2.5 లక్షల దరఖాస్తులు అందాయని, ఈ నెల 10 వరకూ గడువు ఉన్నందున ఐదు లక్షల వరకూ దరఖాస్తులు రావచ్చని అభిప్రాయపడ్డారు. పరీక్షలు రెండంచెల విధానంలో నిర్వహించనున్నామని, తొలి విడతలో స్క్రీనింగ్ ద్వారా వడపోత పూర్తయిన తర్వాత, ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్ పరీక్షలు ఎంపిక చేస్తామన్నారు. మూడు పేపర్లుగా మొత్తం 450 మార్కులుంటాయన్నారు. గ్రూప్ 2 పోస్టుల భర్తీకి వౌఖిక పరీక్ష ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్స్ (ఎఇఇ) 748 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్స్ (ఎఇ) 256 పోస్టులు భర్తీకి సంబంధించి రాత పరీక్ష ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. గ్రూప్ 3 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితిని పెంచడం వల్ల ఈసారి అత్యధికులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. వీటితో పాటు పలు కేటగిరీ పోస్టులతో పాటు వైద్యుల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉందన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌గా పరీక్షలు నిర్వహించి, వౌఖిక పరీక్ష ఆధారంగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఆరు నెలల్లోగా ఉద్యోగాల భర్తీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎపిపిఎస్‌సి నిర్వహించే పరీక్షల్లో ఇక మీదట నెగెటివ్ మార్కుల విధానాన్ని అవలంబించాలని నిర్ణయించామని చైర్మన్ తెలిపారు. అదృష్టం కలిసొచ్చి ఉద్యోగాలు దక్కించుకునే వారికంటే తెలివైన అభ్యర్థులకు అవకాశం రావాలంటే నెగెటివ్ మార్కుల విధానం ఉత్తమంగా కమిషన్ భావిస్తోందని వివరించారు. దీనివల్ల తప్పుడు సమాధానం రాస్తే మార్కులు తగ్గిపోతాయని, తద్వారా ప్రతిభావంతులే ఉద్యోగాలు పొందుతారన్నారు.