రాష్ట్రీయం

వచ్చే ఏడాది చార్జీల మోతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2017-18లో కూడా విద్యుత్ చార్జీల వడ్డన అనివార్యంగా కనపడుతోంది. ఈ నెలాఖరుకు రెవెన్యూ లోటు, ఏ మేరకు టారిఫ్ పెంచాలనే దానిపై ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కాంలు ఇవ్వనున్నాయి. ప్రస్తుతానికి రెవెన్యూ అవసరాలపై మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చాయి. దాదాపు ఏడున్నరవేల కోట్ల రూపాయల మేర లోటు ఉంటుందని అంచనా. తెలంగాణ ఏర్పడిన తరువాత గత రెండున్నరేళ్లలో విద్యుత్ కొనుగోళ్లకు దాదాపు రూ.5వేల కోట్లను వెచ్చించారు. ఇస్తామన్న విద్యుత్ ఆంధ్ర రాష్ట్రం ఇవ్వకుండా ఎగగొట్టినా, ప్రభుత్వం తీసుకున్న తెగువతో కూడిన నిర్ణయాల వల్ల తెలంగాణ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది. అయితే విద్యుత్ చార్జీలను వరసగా రెండేళ్ల పాటు పెంచినా డిస్కాంలు కోలుకోలేదు. 2015-16లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రూ. 816 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచింది. 2016-17 సంవత్సరానికి రూ. 1813 కోట్ల విద్యుత్ చార్జీలను పెంచారు.
2017-18 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ సదరన్ డిస్కాం, నార్తరన్ విద్యుత్ డిస్కాంలు రెవెన్యూ అవసరాలపై మాత్రమే విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు ఇచ్చాయి. ఇది ఒక రకంగా విచిత్రమైన పరిణామం. సాధారణంగా రెవెన్యూ అవసరాలు, టారిఫ్ ద్వారా ఇప్పుడు వస్తున్న ఆదాయం పోనూ రెవెన్యూ లోటును బహిర్గతం చేయాలి. కాని తెలంగాణ డిస్కాంలు తమకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.31,930 కోట్ల మేర రెవెన్యూ అవసరమని మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చాయి. టారిఫ్ వల్ల వచ్చే ఆదాయాన్ని ప్రస్తావించలేదు. ఇందులో సదరన్ డిస్కాం తమకు రూ.22044 కోట్ల రెవెన్యూ, నార్తరన్ డిస్కాం రూ.9886 కోట్లు అవసరమని పేర్కొన్నాయి.
తెలంగాణలో పెంచిన విద్యుత్ చార్జీలను ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు చేశారు. రకరకాల సాంకేతిక, పరిపాలన కారణాల వల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాల్సిన టారిఫ్‌ను జూలై 1వ తేదీ నుంచి వర్తింప చేశారు. దీని వల్ల ఒక త్రైమాసిక కాలాన్ని డిస్కాంలు కోల్పోయాయి. డిసెంబర్ నెలాఖరు వరకు ఆగితే రెండు త్రైమాసికాల వరకు ఏ మేరకు ఆదాయం వస్తుందో కచ్చితమైన అంచనా వస్తుంది. జనవరి మొదటి వారంలో రెవెన్యూ లోటుపై ఒక స్పష్టత వస్తుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. డిస్కాంలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించి ఉదయ్ స్కీంలో తెలంగాణ డిస్కాంలు చేరాలనే విషయమై రాష్ట్రప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆంధ్రాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే పెంచిన విద్యుత్ చార్జీలు అమలు చేశారని, కాని ఒక త్రైమాసికం ఆలస్యం కావడం వల్ల సమస్య ఉత్పన్నమైందంటున్నారు. పైగా గత ఏడాది చివరి మూడు నెలలకు రెవెన్యూ, ఖర్చు మధ్య లోటును భర్తీ చేసేందుకు ట్రూప్ అప్ చార్జీలను వసూలు చేస్తారు. దీనిపై కూడా కసరత్తును ప్రారంభించారు. 2015-16లో వెయ్యి కోట్లు, 2016-17లో రూ.1900 కోట్ల మేర ట్రూప్ అప్ చార్జీలు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ లెక్కల ప్రక్రియ కొనసాగుతోంది.
కాగా యూనిట్ విద్యుత్ ధర ఉత్పత్తి, సరఫరాకు రూ.6.84 పైసలు వరకు ఖర్చవుతుందని రెవెన్యూపై సమర్పించిన ప్రతిపాదనలో డిస్కాంలు పేర్కొన్నాయి. గత ఏడాది రూ.6.44పైసలకు మండలి ఆమోదించింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది 54,756 ఎంయు విద్యుత్ అవసరమని, కాని అమ్మకాలు 46710 ఎంయు ఉటుందని, అందుబాటులో 66076 ఎంయు విద్యుత్ ఉందని విద్యుత్ వర్గాలు తెలిపాయి. దాదాపు 11వేల ఎంయు మిగులు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని అంచనా. డిస్కాంలు దాదాపు పదివేల కోట్ల రూపాయల మేర నష్టాల్లో ఉన్నాయి.