రాష్ట్రీయం

ముహూర్తం ఖరారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం ఒకే ఒక్కరోజు సమావేశమైన అసెంబ్లీ ఆ తరువాత వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని పలుమార్లు చెప్పినా కార్యాచరణలోకి రాలేదు. మొత్తం మీద డిసెంబర్ మూడో వారంలో సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగా డిసెంబర్ 14న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ ఖరారు కానుంది. అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం ముఖ్యమంత్రి, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రితో సమావేశాలు నిర్వహించాల్సిన రోజులు, అజెండాపై చర్చించారు. ప్రధానంగా రెండున్నర ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో రాష్ట్రంలో పరిస్థితి, రెండున్నర ఏళ్లకాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని కెసిఆర్ సభలో వివరించనున్నారు. విపక్షాలు సైతం రెండున్నర ఏళ్ల కాలంలో ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని సభలో నిలదీయాలని ఇప్పటికే నిర్ణయించాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, మూడు ఎకరాల భూమి పంపిణీ, కేజీ నుంచి పిజి వరకు ఉచిత విద్య, ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలు అన్నీ అమలు చేశామని, చెప్పనివి కూడా అమలు చేస్తున్నట్టు అధికార పక్షం చెబుతోంది. అసెంబ్లీలో ఇదే విషయాన్ని గణాంకాలతో పాటు వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టిఆర్‌ఎస్ నేతలు తెలిపారు.