రాష్ట్రీయం

వివాహాలకు ‘పెద్ద’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: వివాహాలకు పెద్ద నోట్ల దెబ్బ బాగా తగిలింది. మంచి ముహూర్తంగా భావిస్తున్న ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వివాహాలు జరగాల్సి ఉండగా, చాలా మంది వాయిదా వేసుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో మరో మంచి ముహూర్తం చూడాలంటూ వధూవరుల తల్లిదండ్రులు పండితులను ఆశ్రయిస్తున్నారు. ముహూర్తంతో పాటు ఇదివరకే అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్న ఫంక్షన్ హాళ్లను కూడా మరో తేదీకి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకసారి బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ తేదీకి చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వలేమని, అలా ఇస్తే తాము నష్టపోతామని ఫంక్షన్ హాళ్ల యజమానులు పేచీ పెడుతున్నారు. ఇదంతా తల నొప్పిగా మారింది. చాలా వరకు విధి లేని పరిస్థితుల్లో ఆదివారం నాటి ముహూర్తాలకే వివాహాం జరిపించినా, సన్నాయి నుంచి మొదలుకుని వంట వాళ్లు, నీటి సరఫరా చేసే వాళ్లందరికీ డబ్బులు చెల్లించడం కష్టతరమైంది. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికీ వాటిని విత్‌డ్రా చేసుకోవడంపై ప్రభుత్వం పరిమితులు విధించడంతో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. పెళ్లి కార్డు చూపించి బ్యాంకు నుంచి రెండున్నర లక్షల వరకు నగదు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అది ఏ మాత్రం సరిపోదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న మొత్తంలో సగం ఫంక్షన్ హాలు యజమానికి, పెళ్లి మండపానికే సరిపోతుందని, ఇక భోజనాలు, ఇతరత్రా ఏర్పాట్ల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల అన్ని రకాలుగా బాధలు పడుతున్నామని, చివరకు వివాహాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని మాదాపూర్‌కు చెందిన చంద్రకళ తెలిపారు. తమ డబ్బును తాము స్వేచ్ఛగా వాడుకోవడానికి ప్రభుత్వం అడ్డుపడడం ఏమిటని ఆమె ఆగ్రహంతో ప్రశ్నించారు. పెళ్లి కార్డు, ఇతర ఆధారాలు చూపించినా ఆర్‌బిఐ నిబంధన ప్రకారం పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చే అధికారం తమకు లేదని ఆంధ్ర బ్యాంకు జిఎం తెలిపారు.