రాష్ట్రీయం

అంగరంగ వైభవంగా పంచమీతీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం పద్మసరోవరంలో పంచమీతీర్థ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య శాస్త్రోక్తంగా సాగింది. ఈ సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తిరుమల నుండి అమ్మవారికి శ్రీవారి సారెను అట్టహాసంగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి జరిగిన ధ్వజ అవరోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుచానూరు అమ్మవారి ఆలయ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలను టిటిడి యాజమాన్యం అత్యంత వైభవంగా నిర్వహించింది. ముఖ్యంగా అమ్మవారికి చేసిన ఫల, పుష్పాలంకరణలు, స్నపన తిరుమంజనాలు భక్తులకు కనువిందు చేశాయి. ఇక పంచమీ తీర్థం సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి భద్రతా విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ఉత్సవానికి విచ్చేసిన అశేష భక్తజనవాహినికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. టిటిడి ఇఓ డి.సాంబశివరావు, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు, తిరుపతి జెఇఓ పోలా భాస్కర్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

చిత్రం..పద్మ సరోవరంలో పుణ్యస్నానాలకు పోటెత్తిన లక్షలాది మంది భక్తులు