రాష్ట్రీయం

రద్దయిన పెద్ద నోట్లతో రూ.9.9 లక్షల కోట్ల డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: పెద్ద నోట్లు రద్దయి 26 రోజులు గడిచింది. ఆ నోట్లతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేందుకు మరో 26 రోజుల్లో కాలపరిమితి ముగియనుంది. రద్దయిన 500, 1000 నోట్లతో డిసెంబర్ ఒకటో తేదీ వరకు అన్ని బ్యాంకులకు రూ.9.9 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెల 8వ తేదీన ప్రకటించే నాటికి దేశంలో 500, 1000 రూపాయల నోట్లు 14.6 లక్షల కోట్ల వరకు చెలామణిలో ఉన్నాయి. వీటిలో 9.9 లక్షల కోట్ల నగదును ప్రజలు ఇప్పటివరకూ బ్యాంకులకు ఇచ్చేశారు. మొత్తం 14.6 లక్షల కోట్లలో పదిశాతం వరకు నోట్లు ఎప్పటికీ డిపాజిట్ చేయరని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనావేసింది. మరో మూడులక్షల కోట్ల నగదు కూడా డిపాజిట్ కాకపోవచ్చు. ఇదంతా నల్లధనంగా ఆర్‌బిఐ భావిస్తోంది. ఇదంతా ప్రభుత్వానికి డివిడెండ్‌గా మారుతుంది. నవంబర్ 9వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా 25.51 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ఉండగా, నవంబర్ 30వ తేదీ నాటికి వీటి సంఖ్య 25.78 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 8వ తేదీ వరకు 15.67 కోట్లు ఉండగా, గత నెలాఖరుకు ఈ అకౌంట్ల సంఖ్య 15.75 కోట్లకు పెరిగింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో జన్‌ధన్ ఖాతాలు 9.84 కోట్ల నుంచి 10.03 కోట్లకు పెరిగాయి. దేశం మొత్తం మీద జీరో బ్యాలెన్స్ ఖాతాలు 5.93 కోట్లు ఉండగా, నవంబర్ 30వ తేదీ నాటికి వీటి సంఖ్య 5.89 కోట్లకు తగ్గింది. జన్‌ధన్ ఖాతాల్లో నవంబర్ 9వ తేదీ నాటికి రూ.45,637కోట్లు ఉండగా, నవంబర్ 30వ తేదీ నాటికి రూ.74,322 కోట్లకు పెరిగింది.
ఆసుపత్రులు, విద్యా సంస్ధలు, ఇంజనీరింగ్ కాలేజీలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య సంస్థల యజమానులు తమ ఇంట్లో దాచుకున్న పెద్ద నోట్లను తమ సంస్ధల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లో వేశారు. ఈ విధంగా ఒక్కో ఖాతాలో సగటున రూ.49 వేలు జమ అయ్యాయి. దీనికి పాన్ కార్డు అక్కర్లేదు. పైగా ఆ ఉద్యోగుల బ్యాంకు పుస్తకాలను, పోస్టు డేటెడ్ చెక్కులను యాజమాన్యాలు తీసుకున్నాయి. నెలకు ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల జీతంతో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు చట్టానికి జవాబుదారీగా వ్యవహరించని సంస్థల్లో పనిచేస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో యాజమాన్యం చెప్పినట్లుగా రద్దయిన పెద్ద నోట్లను 49 వేల రూపాయల వరకు డిపాజిట్ చేయకపోతే ఉద్యోగం తొలగిస్తారనే భయం చిరుద్యోగులను వెంటాడింది. ఈ తరహా ఖాతాలపై కూడా డిసెంబర్ 30వ తేదీ నుంచి ఆర్‌బిఐ, ఐటి, డెరక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు దృష్టి సారించనున్నాయి. అనుమానస్పద ఖాతాలపై వెంటనే సమాచారాన్ని ఇవ్వాలని ఆర్‌బిఐ ఇప్పటికే బ్యాంకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.