రాష్ట్రీయం

బంగారాన్ని గోడల్లో దాచుకోవల్సిందేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 4: బంగారు ఆభరణాలు కలిగిన వారు మరో 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళాల్సిందేనా? పూర్వీకుల నుండి ప్రాప్తించిన బంగారం, పైసా పైసా కూడబెట్టి ఆ ధనంతో సమకూర్చుకున్న ఆభరణాలను ఇక పాత పద్ధతిలో గోడలు, గచ్చుల కింద పాతిపెట్టుకోవల్సిన అగత్యం ఏర్పడిందా? బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారానికి భద్రత లేదా? ఏ క్షణాన్నైనా బ్యాంకుల్లోని నగలను సీజ్ చేయమని కేంద్రం నుండి ఆదేశాలు జారీ కానున్నాయా? వంటి ప్రశ్నలతో సగటు మనిషి బేజారెత్తుతున్నాడు. గత రెండు రోజులుగా ఎక్కడ చూసిన ఆయా వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద నోట్ల రద్దుతో దాదాపు నెల రోజులుగా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలు తాజాగా బంగారంపై కేంద్రం చేసిన ప్రకటనతో అవాక్కయ్యారు. బంగారంపై విధించిన ఆంక్షలకు సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇక్కట్లకు గురవుతుండగా, ధనికులు చాలా ధీమాగా తమ లావాదేవీలు నిర్వహించుకుంటున్నారు. బంగారం విషయంలో విధించిన ఆంక్షలు కూడా ధనికుల కంటే మధ్య తరగతి వర్గాలకే శిరోభారంగా మారాయి. ముఖ్యంగా ఏ క్షణంలోనైనా బ్యాంకు లాకర్లలో ఉన్న ప్రజల బంగారాన్ని సీజ్ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తీవ్రంగా కలత చెందిన ఆయా వర్గాల ప్రజలు వివిధ బ్యాంకుల్లో లాకర్లను తెరచి, తమ ఆభరణాలను వెనక్కి తెచ్చుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా పలు బ్యాంకుల్లో లాకర్లు తెరుచుకుంటున్నాయి. గతంలో తమ బంగారాన్ని భద్రత రీత్యా బ్యాంకుల్లో దాచుకున్న జనం తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటిని ఇళ్లకు తెచ్చుకుంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. పూర్వం గోడల్లో ఇటుకల మధ్య, భూమిలోను లంకె బిందెల రూపంలో బంగారాన్ని భద్రపరచేవారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మళ్లీ ఆ రోజులు మళ్లీ వస్తాయా? అనే అనుమానం తమకే కలుగుతోందని సాక్షాత్తూ బ్యాంకు అధికారులే వ్యాఖ్యాస్తుండటం విశేషం. తాజా నిబంధనల ప్రకారం వివాహితకు 500 గ్రాముల వరకు, అవివాహితకు 250 గ్రాముల వరకు బంగారు నగలను కలిగివుండవచ్చని కేంద్రం ప్రకటించింది. పూర్వీకుల నుండి సంక్రమించిన బంగారం ఉంటే ఇబ్బంది లేదని, ఏ విధమైనా లెక్కాపత్రం లేని బంగారాన్ని మాత్రమే అక్రమార్జనగా పేర్కొంటారని ప్రకటించారు. దీనిపై ఆయా వర్గాల ప్రజలు అవాక్కవుతున్నారు. పూర్వీకుల నుండి సంక్రమించిన బంగారం అంటేనే లెక్కాపత్రం లేనిదని, అలాగే పాత బంగారాన్ని మార్చి, కొత్త బంగారాన్ని కొనేవారు ఉంటారని, ఈ విధంగా అనేక రూపాల్లో దాచివుంచిన బంగారానికి సంబంధించి ప్రతి గ్రాముకూ లెక్క చెప్పాలంటే సాధ్యమయ్యే పనేనా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
వ్యాపారం ఢమాల్
ఇక బంగారం మార్కెట్‌లో వ్యాపారం ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. నెల క్రితం వరకు 10 గ్రాముల బంగారం సుమారు 30వేలకు పైగా ధర పలికింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం పాతిక వేలకు దిగజారింది. ఉన్న బంగారానే్న ఏంచేసుకోవాలో, ఎలా కాపాడుకోవాలో అర్ధంకాని అయోమయ స్థితిలో ప్రజలుండటంతో కొత్తగా ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సాహసించడం లేదు.