రాష్ట్రీయం

తక్కువ ధరకే సిమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన సిమెంట్‌ను తక్కువ ధరకే సరఫరా చేసేందుకు సిమెంట్ కంపెనీలు ముందుకొచ్చాయి. పోలవరం కాంక్రీటు పనులను డిసెంబర్ 19 నుంచి ప్రారంభించనున్నారు. జనవరిలో డయాఫ్రం వాల్, గేట్ల పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చ్యువల్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం సిమెంట్ కంపెనీల యజమానులు, విశాఖ, భిలాయ్ ఉక్కు కర్మాగారాల సిఎండిలతో సమావేశమయ్యారు. నవాంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు పోలవరమని, దాని నిర్మాణానికి కలసిరావాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు సిమెంట్ కంపెనీల యజమానులు స్పందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు సిమెంట్ బస్తా 250 రూపాయలకే అందించేందుకు ముందుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సుమారు మిలియన్ టన్నుల సిమెంట్ అవసరం అవుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయించాలని కోరారు. దీనికి సిమెంట్ కంపెనీలు ఏకగ్రీవంగా అంగీకరించడంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఇళ్లు, సిసిరోడ్ల నిర్మాణానికి సిమెంట్ రూ.230 రూపాయలకే సరఫరా చేసేందుకు కూడా కంపెనీలు ముందుకొచ్చాయి. అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంట్ బస్తాల రంగు ఎరుపుగా ఉండాలని సిఎం ఆదేశించారు. 18 వేల టన్నుల మేర స్టీల్ అవసరమవుతుందని, ఈమేరకు సరఫరాకు రెండు ఉక్కు కర్మాగారాలు అంగీకరించాయని తెలిపారు.
అత్యాధునిక కాంక్రీటు యంత్రాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి సమావేశం అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సచివాలయంలోని తన చాంబర్‌లో విలేఖరులకు వివరించారు. అత్యాధునిక కాంక్రీటు యంత్రాలను వినియోగిస్తున్నామని చెప్పారు. గంటకు 720 క్యూబిక్ మీటర్లు, రోజుకు 15,000 క్యూబిక్ మీటర్ల మేర తవ్వే కాంక్రీట్ పోరింగ్ యంత్రాలు రప్పిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 19న జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరుకానున్నారని వెల్లడించారు. సంక్రాంతి తర్వాత గేట్ల పనులు ప్రారంభిస్తామన్నారు. రాక్‌ఫిల్ డ్యామ్, పోలవరం ప్రాజెక్టు సామగ్రి తరలించేందుకు వీలుగా రహదారుల నిర్మాణ పనులు కూడా సమీక్షస్తున్నామన్నారు. ప్రాజెక్టును 2018 నాటికి అందుబాటులోకి తెచ్చేలా పర్యవేక్షిస్తున్నామని మంత్రి ఉమ వివరించారు.
జగన్‌కు సవాల్
రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి ఉమ ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగించడమే కాకుండా కొందరితో కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఛోటా నాయకులతో విమర్శలు చేయించటం కాకుండా నేరుగా జగన్ స్పందించాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు అనవసరమని ఇప్పడు చెప్పగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్భ్రావృద్ధికి పనిచేయడమంటే చెడ్డపేరు తేవడమా? అని నిలదీశారు. పులివెందులకు కూడా నీటిని తరలిస్తామని మంత్రి ఉమ స్పష్టం చేశారు.

చిత్రం..సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు, పోలవరం పనులపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు