రాష్ట్రీయం

మీ ఫోనే మీ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: ‘మీ మొబైల్ ఫోనే మీ బ్యాంక్.. ఎపి పర్స్ చిరు వ్యాపారులకు ఉపయోగపడుతుంది. ఎపి పర్స్, మార్పు- మీ నేస్తంతో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నోట్ల రద్దు అనంతర పరిణామాలపై బ్యాంకర్లు, ఆర్‌బిఐ ఉన్నతాధికారులతో సిఎం మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి పర్సు అనే యాప్‌ను ప్రారంభించారు. ఆ యాప్ ద్వారా తొలి లావాదేవీని మార్పు-మీ నేస్తం విధానంలో ఆయన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అనకే చర్యలు తీసుకుంటోందన్నారు. మొబైల్, కార్డుల లావాదేవీలు పెరగాలన్నారు. నగదు రహిత లావాదేవీలు మరింత సులభంగా చేసుకోవడానికి వీలుగా ఎపి పర్స్ యాప్ సిద్ధం చేశామన్నారు. 10 వాలెట్ కంపెనీలు, 13 బ్యాంక్‌లు ఈ యాప్‌లో సభ్యులని తెలిపారు. ఆ సంస్థల్లో ఒకటి ఎంచుకున లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. యాప్ వినియోగంపై క్యాష్ బ్యాక్ సౌకర్యం ఉందని, రిజిస్టర్ చేసుకున్నప్పుడు 60 రూపాయలు వాలెట్‌గా ఇస్తారన్నారు. ఈ ఏడాది ప్రభుత్వానికి ఆదాయం తగ్గి, కొంత నష్టం వచ్చినా, ప్రజలను కష్టాల నుంచి బయటపడేసేందుకు కర్తవ్యంగా భావించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా 70 శాతంమందికి సరకు పంపిణీ చేశామన్నారు. నగదు చెల్లంపులకు ఒత్తిడి తేవడం లేదన్నారు. ఎపి పర్సు, మార్పు-మీ నేస్తం ద్వారా కొత్త అధ్యాయానికి నాంది పలికామన్నారు. ఇప్పటికే 1000 మంది ఉపయోగించుకుంటున్నారని, ప్రతి ఒక్కరినీ డిజిటల్ అక్షరాస్యులుగా మార్చేందుకే ఈ ప్రయత్నాలని వివరించారు. ప్రస్తుతం 2040 కోట్ల రూపాయల నగదు అందుబాటులో ఉందని, వీటిలో చిన్న నోట్లు 211 కోట్ల రూపాయలన్నారు. డిజిటల్ లావాదేవీలపై ఏర్పాటైన జాతీయ కమిటీ సమావేశం ఈ నెల 8న ముంబాయిలో జరుగుతుందని చెప్పారు. ఈ కమిటీ సమావేశంలో కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

చిత్రం..ఎపి పర్స్ యాప్‌ను ప్రారంభిస్తున్న చంద్రబాబు